AP Government Jobs: 3,393 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..జిల్లాల వారిగా పోస్టులు ఇవే..

వైఎస్సార్ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. తద్వారా వైద్య చికిత్సలు, పరీక్షలను ప్రజల చెంతకే తీసుకువెళ్లనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వైద్య ఆరోగ్య శాఖ తొలి దశలో 3,393 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 23వ తేదీ నుంచే దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 6ను చివరి తేదీగా పేర్కొంది.
అర్హులు వీరే..
☛ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ 40 ఏళ్లలోపు) వయసు కలిగి ఉండాలి.
బ కాంట్రాక్టు విధానంలో నియామకాలు ఉంటాయి. తొలుత ఏడాది పాటు కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు. పనితీరు ఆధారంగా సర్వీసు కొనసాగిస్తారు.
☛ బీఎస్సీ నర్సింగ్ మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు.

Assistant Engineer Exam Pattern: అసిస్టెంట్ ఇంజనీర్ సిలబస్ ఇదే...రాత పరీక్ష ఇలా
APPSC Assistant Engineer Exam Books : అసిస్టెంట్ ఇంజనీర్ రాత పరీక్షకు ఏఏ పుస్తకాలు చదవాలి..?
APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..