Paris Olympics : ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం విద్యార్థిని పారిస్ ఒలంపిక్స్‌కు ఎంపిక..
మంగళగిరి: ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌కు ఎస్‌ఆర్‌ఎం విశ్వ విద్యాలయం విద్యార్థిని దండి జ్యోతికశ్రీ ఎంపికైంది. 400 మీటర్ల రిలే పరుగు పందెంలో సత్తా చాటేందుకు ప్యారిస్ వెళ్లింది. అమరావతిలోని యూనివర్సిటీలో జ్యోతిక శ్రీ ఇటీవలే ఫస్ట్ ఇయర్ బీఏ కోర్సులో ప్రవేశం పొందింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఆమె ఇప్పటికే అంతర్జాతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.
Medical and Health Department: వైద్య బదిలీల్లో భారీ అవినీతి!
2021 ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఇండియన్ నేషనల్ క్రీడా పోటీలలో ఉమెన్స్ (అండర్ – 23 కేటగిరి)పరుగు పందెంలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని భారత్ జట్టు తరపున అనేక పతకాలను పొందిన జ్యోతికశ్రీ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటుతుందని యూనివర్సిటీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యోతిక శ్రీని యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య మనోజ్ కుమార్ అరోరా, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ థీరజ్ పరాశర్లు అభినందించారు.