Jobs for Students in TCS : టీసీఎస్‌లో కొలువులు దక్కించుకున్న 30 మంది విద్యార్థులు.. ఇంత ప్యాకేజీతోనే..!

అనంతపురం: ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు టీసీఎస్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది తుది సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులకు చేపట్టిన క్యాంపస్ సెలక్షన్లలో ఇద్దరు విద్యార్థులు ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీతో కూడిన ప్రైమ్ ఆఫీసర్ పోస్టులు దక్కించుకున్నారు. మరో 16 మంది ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీ, 12 మంది ఏడాదికి రూ.3.36 లక్షల ప్యాకేజీతో నింజా ఆఫీసర్లుగా ఎంపికయ్యారు.
JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల..
టీసీఎస్ కంపెనీతో ఎస్‌ఆర్‌ఐటీకి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పించి కొలువులు దక్కేలా యాజమాన్యం చర్యలు తీసుకుంది. కొలువులు దక్కించుకున్న 30 మంది విద్యార్థులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఐటీ కరస్పాండెంట్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అంకితభావం, కృషి, పట్టుదలకు తార్కణమే మంచి కంపెనీల్లో కొలువులు దక్కడమని పేర్కొన్నారు. ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్ టీం సమష్టి కృషితోనే సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు మున్ముందు మంచి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎం.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యధికంగా టీసీఎస్ కంపెనీలో కొలువులు దక్కించుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
NEET UG Revised Results: ‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!సవరించిన ఫలితాలతో తారుమారైన ర్యాంకులు