Skip to main content

Revanth Reddy Promises To Fill 30000 Jobs: మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాల భర్తీ.. జాబ్‌ కేలండర్‌ ద్వారా రిక్రూట్‌మెంట్స్‌

Revanth Reddy Promises To Fill 30000 Jobs

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచి్చనట్టు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా 11 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నామని, అదేవిధంగా గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలు కలిపి 30 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగాల భర్తీ ఒకటని, అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్‌ సరీ్వసెస్‌ అండ్‌ సివిల్‌డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌ మెన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్‌లో పాల్గొన్న 483 మంది ఫైర్‌ మెన్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అగి్నమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో కలిసి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన వారికి ట్రోఫీలను, అదేవిధంగా అగి్నమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్లుగా నియమితులైన 157 మందికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి నియామక పత్రాలను అందించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. 


జాబ్‌ కేలండర్‌ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ 
‘ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం. ఇప్పటికే ఇచి్చన ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీకానున్న పోస్టులు కలిపితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసినట్టవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్‌ కేలండర్‌ ద్వారా అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మంత్రులు, అధికారుల దృష్టికి తెండి. నిరసనలు తెలపాల్సిన పనిలేదు.. ఆందోళన చెందాల్సిన పని అంతకంటే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు. సహేతుకమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్‌ అన్నగా ఎప్పుడూ నిబద్ధతతో పని చేస్తా..’అని సీఎం పేర్కొన్నారు.  

NEET UG Revised Results: ‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌!సవరించిన ఫలితాలతో తారుమారైన ర్యాంకులు

ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది.. 
‘ప్రభుత్వ ఉద్యోగులకు యజమాని రాష్ట్ర ప్రభుత్వం. యజమాని ప్రతి నెలా ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు. గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితి తెచి్చంది. పదవీ విరమణ పొందిన వారికి పింఛన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది.

కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక నిబద్ధతను పాటించి.. ప్రతి నెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ పొందిన వారికి ఫించన్‌ అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో భాగంగా గురువారం నాటి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యకు, ఉపాధికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రైతులకు సహాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం..’అని సీఎం తెలిపారు. 

Reserve Bank of India Jobs: రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

ఇది ఉద్యోగం కాదు..సమాజ సేవ  
‘కఠినమైన ఫైర్‌ మెన్‌ శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి సేవలందించేందుకు 483 మంది ముందుకు వచి్చనందుకు సంతోషంగా ఉంది. ఫైర్‌ సిబ్బంది అంటే కేవలం జీత భత్యాల కోసమే పని చేసేవారు కాదు. వరదలు ఇతర ఏ విపత్తు వచ్చినా ప్రాణాలు త్యాగం చేసైనా ప్రజలను కాపాడతామన్న సామాజిక బాధ్యత తీసుకోవడం..’అని రేవంత్‌ అన్నారు.

యువకులను సుశిక్షితులుగా మార్చిన తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్‌ సర్వీసెస్‌ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉద్యోగులను సీఎం అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఫైర్‌ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, అగ్నిమాప శాఖ డైరెక్టర్‌ జీవీ నారాయణరావు , ఇతర అధికారులు పాల్గొన్నారు.

Published date : 27 Jul 2024 09:46AM

Photo Stories