LPU Campus Placements : ఎల్‌పీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు.. రూ. 1.03 కోట్ల ప్యాకేజీతో ఈ ఉద్యోగం..

సాక్షి ఎడ్యుకేషన్: పంజాబ్ రాష్ట్రంలోని ఎల్‌పీయూలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్లేస్మెంట్లను నిర్వహించారు. ఇందులో, ప్రతీ విద్యార్థి తమ నైపుణ్యాలను కనబరిచి, మరింత మెరుగుపర్చుకున్నారు. ఎల్‌పీయూలోని బీటెక్ విద్యార్థుల్లో 1,700 మందికిపైగా విద్యార్థులు ఈ ప్లేస్మెంట్‌లో పాల్గొన్నారు. ఇక్కడ, అనేక కంపెనీలు ఉద్యోగ ఆఫర్లును చూపగా.. చాలామంది విద్యార్థులు ఏఐ రోబోటిక్స్ కంపెనీల్లోనే ఆఫర్లు పొందారు.
వేర్వేరు కంపెనీలు..
విద్యార్థులు ప్లేస్మెంట్‌లలో ఉద్యోగాలు పొందేందుకు ఏటా వివిధ కంపెనీలు కళాశాలల్లోకి వస్తుంటాయి. అలా, ఎల్‌పీయూలో బీటెక్ విభాగాల నుండి 7,361 ఆఫర్‌లు విద్యార్థులకు వచ్చాయి. ప్రముఖ కంపెనీలైన పాలో ఆల్టో నెట్‌వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల నుంచి చాలామంది విద్యార్థులు ఈ ప్లేస్‌మెంట్‌లను పొందారు.
బీటెక్‌లో సుమారు 1,700 మందికి పైగా విద్యార్థులు అగ్ర శ్రేణి అంతర్జాతీయ కంపెనీల నుండి ఆఫర్‌లు వచ్చాయి. ప్రతీ ఒక్కరి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. అగ్ర శ్రేణి అంతర్జాతీయ కంపెనీలు అందించే సగటు వార్షిక ప్యాకేజీ రూ.16 లక్షలుగా ఉంది.
7 ఉద్యోగాలు..
ఈ ఏడాది బీటెక్ విద్యార్థుల్లో వేలల్లో వార్షిక వేతనంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ప్యాకేజీలతో ఉద్యోగాలను అందుకుని సభాష్ అనిపించుకున్నారు. వీరిది ఇలా ఉంటే, మరోవైపు.. బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి బేతిరెడ్డి నాగ వంశీ రెడ్డి మిగితావాళ్లకన్నా అత్యధికంగా రూ. 1.03 కోట్ల ($1,18,000) ప్యాకేజీని సాధించాడు. ఇక, అతని జాబ్ విషయానికొస్తే.. ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థలో రోబోటిక్స్ ఇంజనీర్‌గా చేరడానికి అతడు ఈ ఆఫర్‌ను పొందాడు.
ఈ కోర్సులోనే బీటెక్ చేస్తుండగా అదే రంగంలో ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. వర్సిటీలోని 1,912 మంది బీటెక్ విద్యార్థులు ఒకటికి మించిన ఉద్యోగ ఆఫర్‌లను సాధించుకున్నారు. వారిలో ఆదిరెడ్డి వాసు అనే విద్యార్థి ఒకటి, రెండు కాదు ఏకంగా 7 ఉద్యోగ ఆఫర్‌లను పొందాడు. ఒక్క ఉద్యోగం దొరక్క చాలామంది యువత కింద మీద పడుతుంటే ఈ విద్యార్థి ఏకంగా ఏడు ఉద్యోగాలను దక్కించుకోవడం విశేషం.
2024 తరహాలోనే..
గత సంవత్సరంలో అంటే.. 2024లో కూడా ఎల్‌పీయూలో ప్లేస్మెంట్ల విషయంలో విద్యార్థులు ఎక్కడ కూడా తగ్గలేదు. వారూ ఉన్నత ఉద్యోగాలను, ప్యాకేజీలను పొందారు. అప్పుడు పాలో ఆల్టో నెట్‌వర్క్స్ రూ.54.75 లక్షలు, న్యూటానిక్స్ రూ.53 లక్షలు, మైక్రోసాఫ్ట్ రూ.52.20 లక్షలు వార్షిక ప్యాకేజీలను అందించాయి. గత సంవత్సరం 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదు, ఏడుగురు విద్యార్థులకు ఆరు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- btech students
- Lovely Professional University
- btech final year students
- Placements
- job offers for students
- AI companies
- 1.03 crores annual package
- AI Robotics
- Technology Development
- 7 job offers
- engineering students achieves placements
- btech final year
- lpu btech students for placements
- Education News
- Sakshi Education News