Shiksha Saptah : శిక్షా సప్తాహ్‌లో విద్యార్థుల నైపుణ్యాలకు అభినందనలు..
అమలాపురం టౌన్: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జరుగుతున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంతో ఉపాధ్యాయుల్లో బోధనా నిబద్ధత పెరుగుతుందని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదనరావు అన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకూ జరుగుతున్న ఈ శిక్షా సప్తాహ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు భాగస్వామ్యం కావాలన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో మధుసూదనరావు శుక్రవారం పాల్గొని నైపుణ్య శిక్షణలో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను పరిశీలించారు.
NEET UG 2024 Revised Results: ‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!.. కటాఫ్ మార్కు ఇలా
ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనలను తిలకించి అభినందించారు. జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలపై, విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధత వెలికితీయడమే శిక్షా సప్తాహ్ ముఖ్య ఉద్దేశమని మధుసూదనరావు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో రోజు వారీ ప్రణాళికను ఉపాధ్యాయులు ఎలా అమలు చేస్తున్నదీ ఆయన పరిశీలించారు. డీవైఈవో గుబ్బల సూర్య ప్రకాశం, సమగ్ర శిక్ష ఏపీవో ఏంఏకే భీమారావు, ఏఎల్‌ఎస్‌ఓ రమేష్, కోర్స్ కో ఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, సీఆర్పీ మెండి శ్రీనుబాబు పాల్గొన్నారు.
Sixth Class Entrance Exam : జవహార్ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు పరీక్ష.. విధానం ఇలా!