Sixth Class Entrance Exam : జవహార్ నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు పరీక్ష.. విధానం ఇలా!
జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో విద్యార్థుల ప్రవేశాల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష 2025కు సెప్టెంబంర్ 16 వరకు దరఖాస్తులకు గడువు కల్పించారు. ఈ ప్రవేశ పరీక్ష 2025లో జనవరి, 18న నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు www.navodaya.gov.in లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే, ఆరో తరగతిలో చేరేందుకు విద్యార్థులు ఆయా జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ, లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండడం, లేదా అదే జిల్లా వాసిగా ఉండేవారు అర్హులని పేర్కొన్నారు.
దీంతోపాటు, విద్యార్థి ఐదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని కూడా ప్రకటించారు అధికారులు. ఇక పరీక్ష విధానానికొస్తే.. ఈ ప్రవేశ పరీక్ష మూడు విభాగాల్లో ఉంటుంది అంటే, మెంటల్ ఎలిజిబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ ఉంటాయి. అయితే, ఈ పరీక్షలో విద్యార్థులు పొందే మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు రెండు గంటల్లో 100 మార్కుల ప్రశ్నలకు ఉండే 80 జవాబులు రాయాల్సి ఉంటుంది. వంద మార్కులకు ఉండే ఈ పరీక్షను 2 గంటల్లో 80 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది.