IIP Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అడ్జంక్ట్ ప్రొఫెసర్లు–02, అసిస్టెంట్ ప్రొఫెసర్లు–08, యంగ్ ప్రొఫెషనల్–01.
అడ్జంక్ట్ ప్రొఫెసర్లు:
అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్, రీసెర్చ్ ఇన్ ప్యాకేజింగ్‌లో అనుభవం ఉండాలి.
వేతనం నెలకు రూ.80,000 చెల్లిస్తారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు:
అర్హత: మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు నెట్ అర్హత సాధించాలి. నాన్ నెట్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అనుభవం ఉండాలి.
వేతనం నెట్ అర్హులకు నెలకు రూ.45,000, నాన్ నెట్ అభ్యర్థులకు నెలకు రూ.42,000, ఇతరులకు నెలకు రూ.38,000 చెల్లిస్తారు.
యంగ్ ప్రొఫెషనల్:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు హిందీ, ఇంగ్లిష్ చదవడం, రాయడం రావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, అందేరి(ఈస్ట్), ముంబై–400093 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021
వెబ్‌సైట్: https://www.iip-in.com/
Qualification | GRADUATE |
Last Date | November 01,2021 |
Experience | 2 year |
For more details, | Click here |