BEL Hyderabad Recruitment: బెల్, హైదరాబాద్‌లో 84 ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్), హైదరాబాద్ యూనిట్..ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 84
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–33, ప్రాజెక్ట్ ఇంజనీర్లు–51.
ట్రెయినీ ఇంజనీర్లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)లో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐ.ఈ.నాచారం, హైదరాబాద్–500076, తెలంగాణ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.12.2021
వెబ్‌సైట్: https://www.bel-india.in
చదవండి: ECIL Recruitment: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో 300 పోస్టులు.. నెలకు రూ.25వేలు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 31,2021 |
Experience | 3 year |
For more details, | Click here |