Skip to main content

ECIL Recruitment: ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 300 పోస్టులు.. నెలకు రూ.25వేలు వేత‌నం..

ECIL Hyderabad Recruitment

భారత ప్రభుత్వ అణశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 300
పోస్టులు: టెక్నికల్‌ ఆఫీసర్లు
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ /ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్స్‌ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 30.11.2021 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి. 
వేతనం: నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను న్యూఢిల్లీలోని జోనల్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కోసం పిలుస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, మచిలీపట్నంలో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.35 వేల‌ వేత‌నం..


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories