RCIL Recruitment: ఆర్‌సీఐఎల్, న్యూఢిల్లీలో 69 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఆర్‌సీఐఎల్).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్–52, మేనేజర్–10, సీనియర్ మేనేజర్–07.
విభాగాలు: టెక్నికల్, ఎలక్ట్రికల్, సివిల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎల్‌ఎల్‌బీ(ఫుల్ టైం), ఎంబీఏ/పీజీ డిప్లొమా /సీఏ/ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని 150 మార్కులకి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్షా సమయం 120 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కి 100 మార్కులు, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌కి 50 మార్కులు. రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022
వెబ్‌సైట్: https://www.railtelindia.com/
చదవండి: BLCL Recruitment: బీఎల్‌సీఎల్, కోల్‌కతాలో మేనేజర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 23,2022 |
Experience | 2 year |
For more details, | Click here |