NEPA Limited: నెపా లిమిటెడ్, మధ్యప్రదేశ్‌లో 48 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ.. మధ్యప్రదేశ్‌లోని నెపా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: సివిల్ ఇంజనీర్–03, డీసీఎస్/క్యూసీఎస్ ఆపరేటర్–06, పేపర్ మెషిన్ ఆపరేటర్–15, ఐటీఐ(ఫిట్టర్)–06, ఐటీఐ(ఎలక్ట్రీషియన్)–10, ఐటీఐ (ఇన్‌స్ట్రుమెంట్)–08.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో/ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(పీఅండ్‌ఏ), నెపా లిమిటెడ్, నెపానగర్, బుర్హాన్‌పూర్ జిల్లా, మధ్యప్రదేశ్–450221 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
వెబ్‌సైట్: http://nepamills.co.in/
Qualification | GRADUATE |
Last Date | September 07,2021 |
Experience | Fresher job |