Skip to main content

Airports Authority of India: ఏఏఐలో గ్రాడ్యుయేట్, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Airports Authority of India

ముంబైలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ), వెస్టర్న్‌ రీజియన్‌.. వివిధ ట్రేడులు/విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 90
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–25, డిప్లొమా అప్రెంటిస్‌లు–38, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–27.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానిక్‌/ఆటో ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్‌ నావిగేషనల్‌ సర్‌వైవలెన్స్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానిక్‌/ఆటో ఇంజనీరింగ్, సివిల్, కమ్యూనికేషన్‌ నావిగేషనల్‌ సర్‌వైవలెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: 
ట్రేడులు: మోటార్‌ వెహికల్‌ మెకానిక్, డీజిల్‌ మెకానిక్‌. 
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. 
స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

వెబ్‌సైట్‌: https://www.aai.aero

చ‌ద‌వండి: Apprentice Posts: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో 355 పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories