Skip to main content

ITI Ltd Recruitment: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో చీఫ్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

ITI Ltd Bangalore

బెంగళూరులోని ఐటీఐ లిమిటెడ్‌.. చీఫ్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41
విభాగాలు: డేటాసెంటర్, నెట్‌వర్క్, సెక్యూరిటీ, డేటాసెంటర్‌ అండ్‌ సేల్స్‌ మార్కెటింగ్, అర్‌ అండ్‌ డీ.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు 45ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 40ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: చీఫ్‌ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.80,240(బేసిక్‌+డీఏ+హెచ్‌ఆర్‌ఏ), డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.65,195(బేసిక్‌+డీఏ+హెచ్‌ఆర్‌ఏ) చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, ఐటీఐ భవన్, దూరవాణి నగర్, బెంగళూరు–560016 చిరునామకు పంపించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://www.itiltd.in

చ‌ద‌వండి: Airports Authority of India: ఏఏఐలో గ్రాడ్యుయేట్, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date November 25,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories