1.55 lakh posts vacant: త్రివిధ దళాల్లో 1.55 లక్షల ఖాళీలను భర్తీ చేయండి
![Over 1.55 lakh posts vacant in three forces](/sites/default/files/images/2023/08/10/indianarmy-1691661549.jpg)
సాక్షి, న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1.55 లక్షల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఇంటర్ సర్విసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు–2023పై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆర్మీలో 1.36 లక్షలు, నౌకాదళంలో 12,500, వైమానికదళంలో ఏడువేల ఖాళీలున్నాయని చెప్పారు.
Indian Navy Recruitment 2023: 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
రక్షణ రంగంపై అమెరికా, చైనా ఏటా తమ జీడీపీలో 3.38 శాతం (801 బిలియన్ డాలర్లు), 1.74 శాతం (293 బిలియన్ డాలర్లు) ఖర్చుచేస్తుంటే భారత్ కేవలం 77 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చుచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంపై చేస్తున్న వ్యయం క్రమంగా తగ్గిపోతోందని చెప్పారు. ఈ బిల్లుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా మాట్లాడారు.