National Apprentice Mela: 11న నేషనల్ అప్రెంటీస్ మేళా.. 205 పోస్టులు..
Sakshi Education
![National Apprentice Mela on 11th March](/sites/default/files/images/2024/03/09/mini-job-mela-1709984104.jpg)
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఐటీఐలో ఈనెల 11వ తేదీన నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహించున్నట్లు ప్రిన్సిపాల్ చందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ష్నేడర్ ఎలక్ట్రిక్ ఇండియా హైదరాబాద్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఆదర్శ ఆటో మొబైల్స్, ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 205 ఖాళీలున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, కోపా, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాప్ట్స్‌మెన్ సివిల్ ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు మంచిర్యాల ఐటీఐలో సంప్రదించాలని సూచించారు.
Published date : 09 Mar 2024 05:05PM