Non-Teaching Employees: కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లను క్రమబద్ధీకరించాలి
ఖలీల్‌వాడి: కేజీబీవీ నాన్ టీచింగ్ – వర్కర్లను క్రమబద్ధీకరించాలని, తక్షణమే కనీస వేతనాలను అమలు చేయాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ – వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు బుధవారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఐ ఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. కేజీబీవీల్లో సిబ్బందికి కనీస వేతనాలు అమలు కాక, శ్రమదోపిడీకి గురవు తున్నారన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కా ర్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇ చ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావ డం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి కేజీబీవ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ ని మంత్రి, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యూని యన్ రాష్ట్ర నాయకులు హేమలత, కేజీబీవీ సిబ్బంది సంధ్య, సుమలత, సుకన్య, శారద, ప్రేమ, చంద్రకళ, ఉమ, మాధవి పాల్గొన్నారు.
Telangana: ‘కేసీఆర్ విద్యాబంధు’.. వీరికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్
ముగ్గురు సీఐల బదిలీలు
ఖలీల్‌వాడి: మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తు న్న 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో నిజామాబాద్ సీసీఎస్‌లో ఉన్న సీఐ డాబాటా మోహన్ నిర్మల్ జిల్లా ఖా నాపూర్ సీఐగా బదిలీ అయ్యారు. అలాగే వె యిటింగ్‌లో ఉన్న సీఐ రవీంధర్ సీసీఎస్‌కు బ దిలీ అయ్యారు. ఎస్బీలో సీఐగా పదోన్నతి పొందిన ఎన్‌ఎస్ ప్రసాద్ డీటీసీ ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు.