Anganwadi Jobs: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
తుమ్మపాల: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అఽధికారి కె.అనంతలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. యలమంచిలి ఐసీడీఎస్ పరిధిలో ఒకటి, గొలుగొండ పరిధిలో రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, యలమంచిలి–9, సబ్బవరం, గొలుగొండ, రావికమతం పరిధిల్లో 5 చొప్పున, అనకాపల్లి, నక్కపల్లి పరిధిల్లో 3 చొప్పున, వి.మాడుగుల పరిధిలో 2 మొత్తం 32 ఆయా పోస్టులకు అర్హత గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు వయసున్న, పదోతరగతి ఉత్తీర్ణులైన స్థానిక, వివాహితలు అర్హులన్నారు. వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలు జత పరిచిన దరఖాస్తులను ఈ నెల 29లోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి అందించాలన్నారు. అర్హులైన వారికి కాల్ లెటర్ పంపిస్తామని, అందులో పేర్కొన్న తేదీనాడు నిర్దేశిత ప్రదేశంలో జరిగే ఎంపిక ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా సూచించారు. వివరాలకు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.