Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
Sakshi Education
పెందుర్తి: స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి నిమిత్తం ఈ నెల 21న స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Job Mela job mela for freshers
వివిధ కంపెనీల్లో 250 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ ఉతీర్ణత సాధించి, 18–35 ఏళ్ల వయసుగల అభ్యర్థులు హాజరు కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు 77025 06614 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
జాబ్‌మేళా ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టులు: 250 విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్