Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్ గార్డులో 322 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్(జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 02/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 322
పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–35, యాంత్రిక్(మెకానికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–09, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)–05.
అర్హతలు
నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి.
నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి.
యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభతేది: 04.01.2022
దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in
చదవండి: IMA Recruitment: ఇండియన్ మిలిటరీ అకాడమిలో 188 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |