Skip to main content

IMA Recruitment: ఇండియన్‌ మిలిటరీ అకాడమిలో 188 పోస్టులు.. ఎవరు అర్హులంటే...

Indian Military Academy

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమి(ఐఎంఏ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 188
పోస్టుల వివరాలు: కుక్, ఎంటీ డ్రైవర్, బుక్‌ మేకర్‌/రిపెయిరర్, ఎల్‌డీసీ, మసాల్చి, వెయిటర్, ఫాటిగ్యూమెన్, ఎంటీఎస్‌(సఫాయివాలా), గ్రౌండ్స్‌మెన్, జీసీ ఆర్డర్లీ, ల్యాబొరేటరీ అటెండెంట్, బార్బర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో నైపుణ్యంతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ప్రశ్న పత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఇండియన్‌ మిలిటరీ అకాడమి(ఐఎంఏ), డెహ్రాడూన్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 14.01.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

చ‌ద‌వండి: Defence Jobs

Qualification 10TH
Last Date January 14,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories