Skip to main content

Indian Coast Guard Recruitment: 50 అసిస్టెంట్‌ కమాండెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Indian Coast Guard

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ 02/2022 బ్యాచ్‌ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌(గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: జనరల్‌ డ్యూటీ(మేల్‌)–30, కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ(సీపీఎల్‌–ఎస్‌ఎస్‌ఏ)(మేల్‌/ఫిమేల్‌)–10, టెక్నికల్‌(ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)(మేల్‌)–10.

జనరల్‌ డ్యూటీ(మేల్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తోపాటు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.

కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ(సీపీఎల్‌–ఎస్‌ఎస్‌ఏ)(మేల్‌/ఫిమేల్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ జారీ చేసిన వాలిడ్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. 
వయసు: 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.

టెక్నికల్‌(ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)(మేల్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.07.1997 నుంచి 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ప్రిలిమినరీ పరీక్ష: మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌/కాగ్నిటివ్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్, పిక్చర్‌ పర్‌సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌పై ఇంగ్లిష్‌ భాషలో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్‌ సెలక్షన్‌ ప్రక్రియకు ఎంపికచేస్తారు. ఈ ఫైనల్‌ సెలక్షన్‌లో సైకలాజికల్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్‌) ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 06.12.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:17.12.2021

వెబ్‌సైట్‌: https://www.joinindiancoastguard.gov.in/

చ‌ద‌వండి: Indian Air Force Recruitment: ఎయిర్‌ఫోర్స్‌లో 317 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date December 17,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories