Indian Navy Recruitment 2022: 217 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమి(ఐఎన్‌ఏ) జూన్ 2023లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/కేడర్ /స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలుంటాయి. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 217
బ్రాంచి/కేడర్ వివరాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: జనరల్ సర్వీస్/హైడ్రో కేడర్-56, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్-05, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్-15, పైలట్-25, లాజిస్టిక్స్-20; ఎడ్యుకేషన్ బ్రాంచ్: ఎడ్యుకేషన్-12; టెక్నికల్ బ్రాంచ్: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-25, ఎలక్ట్రికల్ బ్రాంచ్(జనరల్ సర్వీస్)-45, నావల్ కన్‌స్ట్రక్టర్-14.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ప్రారంభవేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండ ర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2022
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |