Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో 50 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఇండియన్ నేవీ స్పెషల్ నావల్ ఓరియంటేషన్ కోర్సు కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
శిక్షణా కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీలో బీఈ/బీటెక్ (లేదా) ఎమ్మెస్సీ(కంప్యూటర్/ఐటీ)/ఎంసీఏ /ఎంటెక్(కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 02.07.1997 నుంచి 01.01.2003 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: కోవిడ్–19 కారణంగా ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా అకడమిక్ మెరిట్ ద్వారానే షార్ట్‌లిస్టింగ్ చేయనుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 27.01.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీ–జేఏజీ ఎంట్రీ స్కీమ్.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |