Skip to main content

Indian Navy Recruitment 2023: ఇండియన్‌ నేవీలో 100 అగ్నివీర్‌(ఎంఆర్‌) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భారత నౌకాదళంలో అగ్నివీర్‌(ఎంఆర్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 02/2023(నవంబర్‌ 23) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది.
Indian Navy Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 100(పురుషులు-80, మహిళలు-20).
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థి 01.11.2002 నుంచి 31.04.2005 మధ్యలో జన్మించి ఉండాలి.
అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 
కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157సెం. మీ. మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష(సీబీఈ), రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ. 33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం లభిస్తుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌/హిందీ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొప్పున 50 మార్కులను కలిగి ఉంటుంది. సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో పదో తరగతి స్థాయిల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నె­గిటì వ్‌ మార్కింగ్‌ ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 15.06.2023.
శిక్షణ ప్రారంభం: 2023 నవంబర్‌ నెలలో

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

చ‌ద‌వండి: Indian Navy Recruitment 2023: 1365 అగ్నివీర్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories