Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో 1400 అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 1400
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.05.2002 నుంచి 31.10.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
కనిష్ట ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం.మీ, స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.35,000, నాలుగో ఏడాది రూ.40,000 ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది మేలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 08.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరితేది: 17.12.2022
శిక్షణ ప్రారంభం: 2023 మే నెలలో
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |