196 Tech Posts in Indian Army: ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం
Sakshi Education
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం పలుకుతుంది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) విధానంలో 196 టెక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అవివాహిత మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తారు. దీంతోపాటు లెఫ్టినెంట్ హోదాతో కొలువు, ఆకర్షణనీయ వేతనం పొందొచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య:196(పురుషులకు-175, మహిళలకు-19, ఆర్మీ విడోలకు 2 పోస్టులు)
- విభాగాలవారీ పోస్టులు: సివిల్ 47, ఎలక్ట్రికల్ 17, ఎలక్ట్రానిక్స్-26, మెకానికల్-34, ఇతర విభాగాలు 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్ 4, కంప్యూటర్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-6, ఎలక్ట్రికల్-2, ఎలక్ట్రానిక్స్-3, మెకానికల్ 4 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులతోపాటు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజనీరింగ్ అభ్యర్థులు అర్హులు.
- వయసు: ఏప్రిల్ 01, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆర్మీ విడోల గరిష్ట వయసు 35 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మార్కులకు కటాఫ్ నిర్ణయిస్తారు. కటాఫ్ మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకాలజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొదటి రోజు స్టేజ్-1 స్క్రీనింగ్(ఇంటెలిజెన్స్) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారినే స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
వేతనాలు
- ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో 2024 ఏప్రిల్‌లో శిక్షణ ప్రారంభమవుతుంది. 49 వారాలపాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే నెలకు రూ.56100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మాద్రాస్ యూనివర్సిటీ అందిస్తుంది.
- ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.56100(లెవల్ 10) మూలవేతనంతో పాటు మిలటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. వీటితో పాటు పలు ప్రోత్సాహకాలు కూడా పొందవచ్చు.
పదోన్నతులు
- శిక్షణ పూర్తిచేసుకున్న వారికి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇలా ఎంపికైన వారు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తులను అనుసరించి కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్ కమిషన్) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు.
- లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరిన వారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 19, 2023
- వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |