Skip to main content

Air Force Agniveer Notification 2023: ఇంటర్‌తోనే ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు.. 25 శాతం మందికి శాశ్వత కొలువు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన వారికోసం భారతీయ వాయుసేన అగ్నివీర్‌వాయు (01/2024) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అగ్నిపథ్‌ స్కీం కింద భర్తీ చేసే ఈ పోస్టులకు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపిన వారిని వాయుసేనలో అగ్నివీరులుగా తీసుకుంటారు. ఎంపికైన వారికి నాలుగేళ్ల పాటు వాయుసేనలో పనిచేసే అవకాశం లభిస్తుంది. అనంతరం 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. మిగతా వారు అగ్నిపథ్‌ స్కీములో భాగంగా ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలతో ఉద్యోగం నుంచి వైదొలుగుతారు..
Air Force Agniveer Notification 2023
  • 2024(1) బ్యాచ్‌కు ప్రకటన విడుదల
  • ఇంటర్‌తోనే ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు

అగ్నివీర్‌వాయులో సైన్స్, నాన్‌ సైన్స్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. సైన్స్‌ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు నాన్‌సైన్స్‌ ఖాళీలకు పోటీ పడవచ్చు. ఇందుకోసం వీరు ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అర్హతలు

  • సైన్స్‌ విభాగం: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. లేదా నిర్దేశిత బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు 50 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్‌ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
  • నాన్‌ సైన్స్‌ విభాగం: ఇంటర్మీడియెట్‌ ఏదైనా గ్రూప్‌తో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాలి. ఏ అర్హతతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. టెన్త్‌/ఇంటర్‌/ఒకేషనల్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.
  • వయసు: 17 1/2 నుంచి 21 ఏళ్ల లోపు ఉండాలి. అంటే.. 27.06.2003 నుంచి 27.12.2006 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎత్తు: అన్ని విభాగాలకు పురుషులు 152.5 సెం.మీ.; మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు ఛాతి వ్యత్యాసం 5 సెం.మీ. ఉండాలి.

చ‌ద‌వండి: Indian Air Force Recruitment 2023: భారత వాయుసేనలో అగ్నివీర్‌ నియామకాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ఎంపిక విధానం
మూడు దశల్లో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఫేజ్‌–1 రాత పరీక్ష, ఫేజ్‌–2 ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులు, ఫేజ్‌–3 మెడికల్‌ టెస్టులుంటాయి. ఈ మూడింటిలో అర్హత సాధించిన వారిని మాత్రమే తుదిగా ధ్రువపత్రాలను పరిశీలించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

ఫేజ్‌–1 రాత పరీక్ష
ఈ పరీక్షను ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. సైన్స్‌ సబ్జెక్టులకు పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. సైన్స్, నాన్‌ సైన్స్‌ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్ష సమ­యం 85 నిమిషాలు ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్,రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అన్ని పరీక్షల్లోనూ ప్రతి ప్రశ్నకు ఒక మా­ర్కు కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. అన్ని ప్రశ్నపత్రాల్లోనూ ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 స్థాయిలో ఉంటాయి. ఎంపిక చేసుకున్న పరీక్షను బట్టి ఇంగ్లిష్‌–20 ప్రశ్నలు, ఫిజిక్స్‌–25 ప్రశ్న­లు, మ్యాథ్స్‌–25 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. 

ఫేజ్‌–2 ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌
ఫేజ్‌–1 రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్‌–2కు అవకాశం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశ పత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికేట్లు, వాటి జిరాక్స్‌ సెట్, ఫోటోలు తదితరాలు తీసుకెళ్లాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 7 నిమిషాలు; మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు ఒక్కోటి నిమిషం వ్యవధిలో 10 పుష్‌ అప్స్, 10 సిట్‌ అప్స్, 20 స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. మహిళలు 90 సెకన్లలో 10 సిట్‌ అప్స్, ఒక నిమిషంలో 15 స్క్వాట్స్‌ పూర్తిచేయగలగాలి. వీటన్నింటిలోనూ అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ టెస్ట్‌ ఉంటుంది. అభ్యర్థి ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడా లేదా అనేది నిర్ణయించడానికి ఆబ్జెక్టివ్‌ తరహాలో ఈ రాత పరీక్ష ఉంటుంది.

ఫేజ్‌–3
అడాప్టబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్టులు నిర్వహించి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.

10+2 స్థాయిలో ప్రిపరేషన్‌
సిలబస్‌ 10+2 సీబీఎస్‌ఈ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సంబ«ంధిత టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టితో చదవాలి. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్‌ విభాగాల్లోని అంశాలను ఎంసెట్‌ స్థాయిలో ప్రిపేరవడం మేలు. దీంతోపాటు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఫలితంగా ఇన్‌టైంలో పరీక్ష పూర్తిచేయగలుగుతారు. అంతేకాకుండా ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుస్తుంది. ఇంగ్లిష్‌కు సంబంధించి వ్యాకరణాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రీజనింగ్‌ విభాగంలో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో రక్షణశాఖలో తీసుకొచ్చిన నూతన సాంకేతికత, ఈ విభాగంలో చోటుచేసుకున్న కీలకపరిణామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితోపాటు స్పోర్ట్స్, అవార్డులు, బుక్స్, ఎన్నికలు తదితర తాజా పరిణామాలపైనా దృష్టిపెట్టాలి. 

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేదీ: 17.08.2023
  • ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 13.10.2023
  • వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in/

కొలువులో ఇలా 
సేవానిధి
ప్రతినెల అందుకునే మొత్తంలో 30శాతం కార్ప­స్‌ ఫండ్‌కి జమచేస్తారు. ఇలా మొత్తం నాలుగేళ్ల కాలానికి సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని వేతనం నుంచి జమవుతాయి. అంతేమొత్తాన్ని ప్ర­భుత్వమూ జమచేస్తుంది. రెండు కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డిని జతచేసి నాలుగేళ్ల తర్వాత వైదొలుగుతున్న సందర్భంగా అగ్నివీర్‌వాయుకు అందజేస్తారు. స్వయం ఉపాధి/వ్యాపారం కోసం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్‌లో మధ్య­లో వైదొలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమైన మొత్తాన్ని మాత్రమే అగ్నివీర్‌వాయుకు అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం మాత్రం దక్కదు.

25 శాతం మందికి శాశ్వత కొలువు
అగ్నివీర్‌వాయు స్కీంలో భాగంగా నాలుగేళ్ల సర్వీస్‌ను పూర్తిచేసుకున్న వారిలో ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్టంగా 25శాతం మందిని మాత్రమే శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం నాలుగేళ్ల వ్యవధిలో చూపిన ప్రతి¿¶ , సంస్థ అవసరాలు ప్రామాణికంగా తీసుకుంటారు. సైన్స్‌ విభాగంలో అవకాశం వచ్చినవారు గ్రూప్‌–ఎక్స్‌(ఫిట్టర్‌) విధులు నిర్వర్తిస్తారు. వీరికి మొదటి నెల నుంచే రూ.33,100 వేతనంగా లభిస్తుంది.నాన్‌సైన్స్‌ అభ్యర్థులు గ్రూప్‌ వై(టెక్నీషియన్‌) సేవలు అందిస్తారు. వీరికి రూ.26,900 మూలవేతనం చెల్లిస్తారు. ఈ రెండు ట్రేడులవారికీ డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. ఎక్స్‌ట్రేడ్‌ల్లోని వారు మొదటి నెల నుంచే రూ.యాభై వేలకు పైగా, వై ట్రే డుల్లో చేరిన వారు సుమారు రూ.45,000 వేతనంగా అందుకోవచ్చు.

పదోన్నతులు
శాశ్వత కొలువు పొందిన తర్వాత సంబంధిత విభాగంలో విధుల్లో పనిచేసే వారు భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌(ఎండబ్లు్యవో) స్థాయి వరకు చేరుకోవచ్చు. సర్వీస్‌లో కొనసాగుతూ సంబంధిత పరీక్షల్లో అర్హత పొందిన వారు కమిషన్డ్‌ ఆఫీసర్లుగా ఎంపికయ్యే అవకాశముంది. అలాగే ఉద్యోగం చేస్తూనే నిర్ణిత వ్యవధిగల ఉన్నత విద్యను కొనసాగించడానికి కూడా అనుమతిస్తారు. పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం ఫించను, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రోత్సాహకాలు
అగ్నివీర్‌వాయులో ప్రవేశం పొందిన వారికి 30 వార్షిక సెలవులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలను బట్టి సిక్‌లీవ్‌లు కూడా ఇస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌ కాలంలో రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్,రేషన్,డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్ల పాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గాను వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు సర్టిఫికేట్‌ అందుతుంది. వీరికి ఫించను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ఎక్స్‌సర్వీస్‌మెన్‌ హోదా ఇవేవీ వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌ ) ఉండదు.

 

చ‌ద‌వండి: Special Entry in Army: ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా 55 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories