Skip to main content

Telangana: పోటీప‌రీక్ష‌ల్లో అత్యంత ముఖ్య‌మైన టాపిక్.. 'తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం-2018' పూర్తి స‌మాచారం

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌, పోలీసు.. మొద‌లైన పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులకు ఎంతో ఉప‌యోగ‌ప‌డే విధంగా.. సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్ర‌ముఖ సబ్జెక్ట్ నిపుణులతో 'తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం-2018కు సంబంధించిన‌ సమ‌గ్ర స‌మాచారాన్ని అందిస్తున్నాము.
telangana panchayat raj act 2018
telangana panchayat raj act 2018

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అనేక నూతన సంస్కరణలకు స్వీకారం చుట్టిన ప్రభుత్వం అందులో భాగంగా నూతన పంచాయతీరాజ్ చట్టం-2018ని తీసుకొచ్చింది.

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

ఈ చట్టం ప్రకారం రాష్ర్టంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక స్వపరిపాలనకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. అందువల్ల పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు ఈ చట్టం అవగాహన ఎంతో ఉపయోగకరం.
మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థకు 1959 నవంబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో అప్పటి ప్రధాని నెహ్రూ శ్రీకారం చుట్టారు.
73 రాజ్యాంగ సవరణ చట్టం కోసం తెలంగాణ సర్కారు జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీశ్ రావు, ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!​​​​​​​

  • 2018 మార్చి 29న తెలంగాణ శాసనసభ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018ను ఆమోదించింది.
  • తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం 2018 ఏప్రిల్ 18 నుంచి అమలులోకి వచ్చింది.
  • ఈ చట్టంలోని మొత్తం భాగాల సంఖ్య - 9
  • ఈ చట్టంలోని మొత్తం చాప్టర్ల సంఖ్య - 10
  • ఈ చట్టంలోని మొత్తం సెక్షన్ల సంఖ్య - 297

చ‌ద‌వండి: TS History Practice Test

నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 - గ్రామాల స్వరూపం:

  • తెలంగాణ రాష్ర్ట జనాభా - 3,50,31,077
  • గామ జనాభా - 2,02,50,978 (58 శాతం)
  • గామ పంచాయతీలు (పాతవి) - 8690
  • కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు - 4383
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీలు - 12,751
  • వార్డులు - 1,13,380
  • వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు - 1326
  • షెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయతీలు - 1311
  • తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్టీ గ్రామ పంచాయతీలు - 2637
  • అత్యధిక గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా- నల్గొండ (844)
  • అత్యల్ప గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా- మేడ్చల్ మల్కాజ్‌గిరి

చ‌ద‌వండి: Indian History Practice Test

గ్రామసభ:

  • భారత రాజ్యాంగంలోని 243(A) అధికరణ గ్రామసభ ఏర్పాటు గురించి పేర్కొంటుంది.
  • నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 3 గ్రామసభ ఏర్పాటు గురించి వివరిస్తుంది
  • ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామసభ ఉంటుంది. గ్రామసభలో ఆ గ్రామానికి చెందిన రిజిస్టర్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు.

Latest Current Affairs

గ్రామసభ సమావేశాలు:

  • తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఆరు సార్లు గ్రామసభ సమావేశం జరగాలి.
  • ఈ సమావేశాలు సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.
  • గ్రామసభ సమావేశాల ఎజెండాను తయారుచేసేది - పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ)
  • గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది - సర్పంచ్
  • ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనపుడు ఉపసర్పంచ్, ఒకవేళ వీరిద్దరూ లేనప్పుడు వార్డు సభ్యులందరూ ఎన్నుకున్న సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు.
  • గ్రామసభ సమావేశాలకు ఆహ్వానితులు - మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, రాష్ర్ట విధాన సభ (అసెంబ్లీ) సభ్యులు.

History Study Material

కోరం (Kouram):
గ్రామసభ నిర్వహించడానికి కావల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. కోరం గురించి నూతన పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 10 తెలియజేస్తుంది.

గ్రామసభలోని రిజిస్టర్‌‌డ ఓటర్లు కోరంనకు కావాల్సినసభ్యుల సంఖ్య
500లోపు 50
501-1000 75
1001-3000 150
3001-5000 200
5001-10,000 300
10,000లకు పైగా 400

Polity Study Material

గ్రామసభ విధులు:
1. గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలన
2. ఆడిట్ నివేదికలు పరిశీలించడం, ఆమోదించడం
3. అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయడం
4. నూతనంగా పన్నులు విధించడం లేదా పన్నులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడం

TSPSC Group-1 Prelims: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఇలా ప్రిపేర‌య్యారంటే..?

సర్పంచ్:

  • సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు అంటారు.
  • గ్రామ పంచాయతీ రాజకీయ కార్య నిర్వహణ అధిపతియే సర్పంచ్.
  • సర్పంచ్‌గా పోటీచేయడానికి 21 సంవత్సరాల వయసు ఉండాలి.
  • 1994 తర్వాత జన్మించిన ముగ్గురు పిల్లలు ఉండకూడదు.
  • ఇతని పదవీ కాలం 5 సంవత్సరాలు.
  • గ్రామంలోని ఓటర్లందరూ పార్టీరహితంగా ప్రత్యక్షంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
  • ఒకవేళ ఏదైనా కారణంతో సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలలు (120 రోజులు) లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించి స్థానాన్ని భర్తీచేయాలి.
  • సర్పంచ్ గ్రామ పంచాయతీకి ఎక్స్-ఆఫీసియో సభ్యునిగా ఉండి అన్ని సమావేశాల్లో పాల్గొంటాడు, ఓటు హక్కును కలిగి ఉంటాడు.
  • సర్పంచ్‌తో ప్రమాణ స్వీకారం చేయించేది ప్రత్యేక అధికారి
  • సర్పంచ్ తన రాజీనామా లేఖను ఓపీవోకు అందించాలి.
  • సర్పంచ్‌కు నెలకు 5000/-వేతనం ఇస్తున్నారు.

Economy Study Material

రాజీనామా & తొలగింపు:

  • సర్పంచ్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే జిల్లా కలెక్టర్ అతనిని పదవి నుంచి తొలగిస్తారు.
  • సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదు.
  • గ్రామసభ సమావేశాలు సంవత్సరంలో కనీసం రెండుసార్లు (పర్యాయాలు) నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు.
  • గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనపుడు పదవి కోల్పోతాడు. ఇతడు గ్రామ పంచాయతీకి నోటీస్ ఇచ్చి రాజీనామా చేయవచ్చు.

Geography Study Material

సర్పంచ్ విధులు:

  • ఇతడు గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడు.
  • గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఏ సమాచారాన్నైనా కోరవచ్చు.
  • పంచాయతీ కార్యదర్శిపై పాలనాపరమైన నియంత్రణను కలిగి ఉంటాడు.
  • గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తాడు.
  • గ్రామ పంచాయతీని కనీసం నెలకొకసారి, గ్రామసభను 6 నెలలకు ఒకసారి (కనీసం) సమావేశపరచాలి.
  • నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇచ్చారు.

Science & Technology Study Material

1. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్
2. 13వ ఆర్థిక సంఘం నిధులు
3. స్టేట్ ఫైనాన్‌‌స కమిషన్‌‌స విధులు
4. బి.ఆర్.జి.ఎఫ్. (Backward Regions Grants Funds)
5. MGNREGS (Mahathma Gandhi National Rural Employment Guarantee Scheme)

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సర్పంచ్ ఎన్నికలు - రిజర్వేషన్:

  • సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది.
  • ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు రొటే ట్ అవుతాయి
  • సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు మహిళలు రిజర్వేషన్ డ్రా తీయాలి.
  • ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాను బట్టి తగినన్ని సీట్లు కలెక్టర్ రిజర్వు చేస్తాడు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాలు ఎస్టీలకే రిజర్‌‌వ చేయాలి.

Group 1 & 2 : సిలబస్‌ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్‌ కుమార్‌ గ్రూప్‌–1 విజేత

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన గౌరవ వేతనాలు:
1. సర్పంచ్ - రూ.5000
2. ఉప సర్పంచ్ - Nill
3. వార్డు సభ్యులు - Nill
4. MPTC - 5000
5. MPP - 10,000
6. ZPTC - 10,000
7. ZP Chairman - రూ.లక్ష

Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

ఎన్నికలలో ఎవరు ఎంత డిపాజిట్ చెల్లించాలి:

పదవి బీసీ ఎస్సీ/ఎస్టీ
సర్పంచ్ రూ.2000/- రూ.1000/-
వార్డు సభ్యులు రూ.500/- రూ.250/-
MPTC రూ.2500/- రూ.1250/-
ZPTC రూ.5000/- రూ.2500/-

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

పద వి

ప్రమాణస్వీకారం రాజీనామా
సర్పంచ్ ప్రత్యేక అధికారి డీపీవో
ఉపసర్పంచ్ రిటర్నింగ్ అధికారి ఎంపీడీఓ
వార్డుసభ్యులు ప్రత్యేక అధికారి ఎంపీడీఓ
ఎంపిటీసీలు రిటర్నింగ్ అధికారి జడ్పీ సీఈఓ
జడ్పీటీలు రిటర్నింగ్ అధికారి కలెక్టర్
ఎంపీపీ మండల ఆర్వో జెడ్పీ సీఈఓ
జడ్పీ చైర్మన్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ఉప సర్పంచ్:

  • ఉప సర్పంచ్‌గా పోటీ చేయడానికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అందరూ కలసి 5 సంవత్సరాల పదవీ కాలానికి ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.
  • ఇతని ఎన్నికను జిల్లా పంచాయతీ అధికారి కాని అతను నియమించిన సంబంధిత అధికారి గాని నిర్వహిస్తాడు.
  • ఇతను తప్పనిసరిగా వార్డు సభ్యుడై ఉండాలి.
  • ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఉపసర్పంచ్‌ను వార్డు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు.
  • సర్పంచ్ కూడా ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
  • సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు.
  • గ్రామ పంచాయతీ అకౌంట్‌లను ఆడిట్ చేస్తాడు.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

ఉప సర్పంచ్ రాజీనామా:

  • ఉప సర్పంచ్ తన రాజీనామాను ఎంపీడీవో కు గానీ, లేదా అతనికి పంపడం కుదరకపోతే జిల్లా పంచాయతీ అధికారికి ఇవ్వాలి.
  • ఉప సర్పంచ్‌ను సగం మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగిస్తారు.
  • ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పదవి కాలంలో రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి.
  • పదవి చేపట్టిన మొదటి రెండు సంవత్సరాల లోపు పెట్టకూడదు.
  • మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు సంవత్సరాల వరకు రెండో తీర్మానాన్ని పెట్టకూడదు.
  • ఉప సర్పంచ్‌ను పదవి నుంచి జిల్లా కలెక్టర్ తొలగిస్తాడు.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

గ్రామ పంచాయతీ వార్డు జనాభా సభ్యుల సంఖ్య
300 వరకు జనాభా 5
301-500 7
501-1500 9
1501-3000 11
3001-5000 13
5001-10,000 15
10,001-15,000 17
15,001-25,000 19
25,000ల కన్నా ఎక్కువ 21

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

గ్రామ పంచాయతీ సమావేశంలో పాల్గొనే సభ్యులు:
 1. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు
 2. ఎంపీటీసీ సభ్యులు
 3. గ్రామ పంచాయతీ కో-ఆప్షన్ సభ్యులు
 4. మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు
 
 భారతదేశంలో మొదటిసారిగా పంచాయతీలకు 1964లో ఎన్నికలు జరిగాయి.
 1981 మొదటిసారిగా సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!
 
 గ్రామ పంచాయతీ విధులు రెండు రకాలు :
 1. ఆవశ్యక విధులు
 2. వివేచనాత్మక విధులు
 
 సర్పంచ్ గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.
 భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌నందు ఉన్న 29 విధులను గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది.

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!
 మాదిరి ప్రశ్నలు :
1. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం?
  1) 6 ఏళ్లు 
  2) 4 ఏళ్లు
  3) 5 ఏళ్లు 
  4) 3 ఏళ్లు

2. గ్రామసభ సభ్యుల సంఖ్య ఎంత?
  1) 17 
  2) 19
  3) 21 
  4) ఏదీకాదు

3. గ్రామసభకు సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
 1) గ్రామంలోని ఓటర్లు అందరూ గ్రామసభలో సభ్యులే
 2) 1000 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామసభ నిర్వహించడానికి కావాల్సిన  కోరం 50 మంది
 3) గ్రామసభ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది
 4) ఏదీ కాదు.
View Answer

4. సర్పంచ్ గైర్హాజరులో గ్రామసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
   1) ఉప సర్పంచ్ 
  2) పంచాయతీ కార్యదర్శి
  3) సీనియర్ సభ్యుడు
  4) విలేజ్ రెవెన్యూ ఆఫీసర్

5. జతపరచండి.
  గ్రామంలో ఓటర్ల సంఖ్య:
  i) 500 వరకు
  ii) 501 నుంచి 1000
  iii) 1001 నుంచి 3000
  iv) 3001 నుంచి 5000
  v) 5001 నుంచి 10000
  vi) 10000 పైగా 
  గ్రామసభ కోరం:
  a) 50 మంది b) 150 మంది
  c) 75 మంది  d) 400 మంది
  e) 200 మంది f) 350 మంది
  g) 300 మంది

  1) i-a, ii-b, iii-c, iv-d, v-e, vi-f
  2) i-a, ii-c, iii-b, iv-e, v-g, vi-d
  3) i-a, ii-b, iii-d, iv-c, v-e, vi-g
  4) i-a, ii-b, iii-d, iv-e, v-f, vi-c

6. 5000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాల్సిన వార్డుల సంఖ్య?
1) 13 

2) 11 

3) 15 

4) 9

Published date : 26 May 2022 04:54PM

Photo Stories