Biology Material for Competitive Exams : పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా.. జయాలజీ మెటీరియల్.. ‘గోల్డెన్ రైస్’ను సృష్టించిన శాస్త్రవేత్త?
డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్
డీఎన్‌ఏ అణువులోని నత్రజని క్షారాల వరస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, ఆ డీఎన్‌ఏ ఇతర ఏ వ్యక్తి డీఎన్‌ఏతో పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్షను ‘డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్’ అంటారు. ఇంగ్లండ్‌లోని లీచెస్టర్ యునివర్సిటీకి చెందిన అలెక్ జెఫ్రీస్ ‘డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ’ను మొదటిసారిగా 1985లో రూపోందించాడు. ఏ ఇద్దరు వ్యక్తుల డీఎన్‌ఏ వరస క్రమం కచ్చితంగా ఒకే విధంగా (సమరూప కవలల్లో తప్ప) ఉండదు. అయితే మానవుడి డీఎన్‌ఏ అణువులో ఉండే 3 బిలియన్ల న్యూక్లియోటైడ్‌లలో 99.9% ఇతర వ్యక్తుల డీఎన్‌ఏను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వైవిధ్యాలు కేవలం 0.1 శాతం న్యూక్లియోటైడ్‌లలో మాత్రమే ప్రధానంగా కనిపిస్తాయి. ఈ విధంగా ఒక వ్యక్తి డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల వరస క్రమంలోని వైవిధ్యం డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌కు మూలాధారం.
డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌లో 4 రకాల డీఎన్‌ఏ మార్కర్‌లను ఉపయోగిస్తారు.
అవి.. RFLP, VNTR, STR, SNP.
సేకరించే నమూనాలు
నేరం జరిగిన ప్రదేశంలో లభించే రక్తం (ముఖ్యంగా తెల్ల రక్త కణాలు), తల వెంట్రుకల మూలాలు, వీర్యం, యోని స్రావం, చర్మంలోని కొంత భాగం లేదా చాలా కాలం కిందట పూడ్చిపెట్టిన శవం ఎముకల నుంచి డీఎన్‌ఏను సేకరిస్తారు.
దోషిని గుర్తించే పద్ధతి
సేకరించిన డీఎన్‌ఏను పీసీఆర్ ప్రక్రియ ద్వారా అనేక వందల రెట్లు పెంచి ఆ నేరానికి సంబంధించిన అనుమానిత వ్యక్తి రక్తం నుంచి సేకరించిన డీఎన్‌ఏ స్వరూపంతో సరి΄ోల్చి నేరాన్ని నిర్ధారిస్తారు.
భారత్‌లో డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్
మనదేశంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించి, వ్యాప్తిలోకి తెచ్చినవారు సీసీఎంబీ డైరెక్టర్ డా.లాల్జీసింగ్. ఈయన కేరళలోని న్యాయస్థానంలో దాఖలైన అత్యాచార కేసులో దోషిని గుర్తించడంలో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
ఈ పరీక్ష జరిపే ‘సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్’ సంస్థను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు.
Jobs: తుంగల్‌గడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఉపాధ్యాయుల ఖాళీలు.. అర్హతలు ఇవే..
అనువర్తనాలు
1. ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా దొంగలు, హంతకులు, అత్యాచారం చేసినవారిని గుర్తించవచ్చు. తల్లిదండ్రులు – పిల్లల మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నిర్ధారించవచ్చు.
2. అంతరించిపోయే జాతుల సంరక్షణకు దీన్ని ఉపయోగిస్తున్నారు.
3. మెడికో, లీగల్ వివాదాల పరిష్కారాల్లో డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ ద్వారా మాతృత్వం, పితృత్వాన్ని కచ్చితంగా కనుక్కోవచ్చు.
4. జంతువులు, మానవుల వర్గ వికాస చరిత్రను తెలుసుకోవచ్చు.
మాదిరి ప్రశ్నలు:
1. ‘బయోటెక్నాలజీ’ (జీవ సాంకేతిక శాస్త్రం) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) జాన్‌కోల్ రీటర్ 2) వాక్స్‌మెన్
3) కార్ల్ ఎరికే 4) లీవెన్ హక్
2. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) ‘డాలి’.. ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్డ్ గొర్రెపిల్ల. దీన్ని ‘రోసేలిన్ ఇన్‌స్టిట్యూట్’ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు
బి) ‘ఈవ్’.. మొదటి క్లోన్డ్ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ ‘సియోల్ నేషనల్ యూనివర్సిటీ’
సి) సంరూప, గరిమా అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), కర్నాల్ (హర్యానా)
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. ‘ఇంటర్‌ఫెరాన్’లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి?
1) అకశేరుకాలు 2) సకశేరుకాలు
3) బ్యాక్టీరియాలు 4) శిలీంధ్రాలు
4. ఇంటర్‌ఫెరాన్‌లను కనుగొన్నవారు?
1) గిల్‌బర్ట్, వీస్‌మన్
2) కోహ్లర్, మిల్‌స్టీన్
3) నాథన్స్ 4) థామ్సన్
5. కిందివాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) వరిలో ఐఖ 8
2) గోల్డెన్ రైస్
3) సజ్జలో పూసా మోతి
4) వేరుశనగలో ఖీMV 3
Chandegave: సబ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా చందేగేవ్
6. కిందివాటిలో ‘బ్యాక్టీరియల్ పెస్టిసైడ్’ ఏది?
1) బాసిల్లస్ ఆంథ్రాసిస్
2) బాసిల్లస్ ఫాలిమిక్సా
3) క్లాస్ట్రీడియం బొట్సులినమ్
4) బాసిల్లస్ థురింజియాన్సిస్
7. ‘తైపేయి’ అనేది ఏ పంట రకం?
1) జొన్న 2) గోధుమ
3) వరి 4) సజ్జ
8. ‘గోల్డెన్ రైస్’ను ఏవిధంగా ఉత్పత్తి చేస్తారు?
1) వరిలోని పూసా రకాన్ని ఐఖ రకంతో సంకరణం చేయడం ద్వారా
2) తైపేయి అనే వరి రకంలో ‘విటమిన్–ఎ’ను ఉత్పత్తి చేసే మూడు జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
3) అధిక దిగుబడిని సాధించడానికి వరిలోని ‘అనామిక’ రకంలోకి జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
4) వరిలోని ‘బీరాజ్’ రకంలో ఉత్పరివర్తనాలను కలిగించడం ద్వారా
9. సూక్ష్మజీవులను ఉపయోగించి.. నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు?
1) బయోఇన్ఫర్మేటిక్స్
2) ప్రోటియోమిక్స్
3) బయోరెమిడియేషన్
4) జీనోమిక్స్
10. జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది?
1) పపేన్ 2) రెన్నెట్
3) లైపాక్సిజినేజ్ 4) లైపేజ్
Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా
11. మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైమ్‌లు వరసగా?
1) పపేన్, రెన్నెట్
2) పపేన్, ప్రోటియేజ్
3) ప్రోటియేజ్, ట్రిప్సిన్
4) రెన్నెట్, లైపేజ్
12. ‘గోల్డెన్ రైస్’ను సృష్టించిన శాస్త్రవేత్త?
1) కొహ్లెర్ 2) నాథన్స్
3) నార్మన్ బోర్లాగ్ 4) ఇంగోపాట్రికుస్
13. కిందివాటిలో జన్యుపరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) బంగారు వరి 2) బంగారు వేరుశనగ
3) బి.టి. పత్తి 4) పైవన్నీ
14. కణజాలవర్ధనం (టిష్యూ కల్చర్) ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) కణ సిద్ధాంతం
2) సెల్యులార్ టోటి పాటెన్సీ
3) కణ వంశానుక్రమ సిద్ధాంతం
4) ఆమ్నిస్ సెల్యులా – ఇ – సెల్యులా
15. ‘సెల్యులార్ టోటి పాటెన్సీ’ అంటే..?
1) ఒక కణం క్షయకరణ విభజన చెందగలిగే శక్తి
2) సరైన నియంత్రణ పరిస్థితుల్లో.. ఆక్సిన్ – సైటోకైనిన్‌లను ఉపయోగించి ప్రకాండ వ్యవస్థను ప్రేరేపించడం
3) అతి శీతల అ«భిచర్య జరిపి ఒక మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడం
4) అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పర్చగలిగే కణం అంతర్గత సామర్థ్యం
16. తొలిసారిగా ‘టోటి పాటెన్సీ’ అనే పదాన్ని ఉపయోగించినవారు?
1) మోర్గాన్ 2) స్టీవార్డ్
3) ముల్లర్ 4) హేబర్ లాండ్
Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానం
17. ‘కణజాలవర్ధన పితామహుడు’ ఎవరు?
1) ఎఫ్.సి. స్టీవార్డ్ 2) మోర్గాన్
3) హేబర్ లాండ్ 4) ముల్లర్
18. కణజాలవర్ధనంలో యానకం pఏ విలువ ఏ విధంగా ఉండాలి?
1) 3.0 5.0 2) 7.2 8.0
3) 5.6 6.0 4) 6.3 7.4
19. కణజాలవర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది?
1) ఆ. . యానకం 2) .M. యానకం
3) M. . యానకం 4) ఔ. . యానకం
20. మౌలిక (బేసిక్) యానకంలో లోపించేవి?
1) సూక్ష్మ మూలకాలు
2) విటమిన్‌లు
3) కార్బొహైడ్రేట్‌లు
4) వృద్ధి నియంత్రకాలు
21. కణజాలవర్ధనంలో ఏర్పడే ‘అవయవ విభేదనం’ చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు?
1) కాలస్ 2) కాలోస్
3) క్లోన్ 4) ఎక్స్ ప్లాంట్
22. ‘సోడియం ఆల్జినేట్’తో రక్షణ కవచాలను ఏర్పర్చి, గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు?
1) ప్లాస్మిడ్‌లు 2) ప్లాస్టిడ్‌లు
3) సంశ్లేషిత/ కృత్రిమ విత్తనాలు
4) సైటోప్లాస్ట్‌లు
23. జతపరచండి.
జాబితా I
a) సోడియం హై΄ోక్లోరైట్
b) మెర్క్యురిక్ క్లోరైడ్
c) సోడియం ఆల్జినేట్
d) సాయిల్ రైట్
జాబితా II
i) విత్తనాల ఉపరితలాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం
ii) వర్ధనం చేసిన మొక్కలను నాటడం
iii) ఎక్స్΄్లాంట్‌ను సూక్ష్మజీవరహితం చేయడం
iv) పిండాలను గుళికలుగా మార్చడం
a b c d
1) iii i iv ii
2) iii i ii iv
3) iv ii iii i
4) i iii ii iv
24. జతపరచండి.
జాబితా I
a) సోమాక్లోనల్ వైవిధ్యాలు
b) సూక్ష్మ వ్యాప్తి
c) శాఖీయ పిండోత్పత్తి
d) అక్లిమటైజేషన్ (వాతావరణానుకూలత)
జాబితా II
i) కాలస్ నుంచి పిండాల లాంటి నిర్మాణాల అభివృద్ధి
ii) కణజాలవర్ధనంలో ఏర్పడిన మొక్క ప్రదర్శించే వైవిధ్యాలు
iii) కణజాలవర్ధనం ద్వారా పెద్దమొత్తంలో తక్కువ స్థలంలో మొక్కలను ఉత్పత్తి చేయడం
iv) కణజాలవర్ధనం ద్వారా ఏర్పడిన మొక్కలు వాతావరణ అనుకూలతను ప్రదర్శించడం
a b c d
1) ii iii iv i
2) ii iii i iv
3) i ii iii iv
4) ii i iii iv
సమాధానాలు:
1) 3 2) 3 3) 2 4) 1 5) 2
6) 4 7) 3 8) 2 9) 3 10) 2
11) 2 12) 4 13) 4 14) 2 15) 4
16) 1 17) 3 18) 3 19) 3 20) 4
21) 1 22) 3 23) 1 24) 2
Tags
- biology study material
- model questions
- questions for biology in competitive exams
- group exams biology
- appsc and tspsc groups exams
- groups exam preparations
- preparatory questions for biology exams
- groups and civils exams preparatory questions
- material and questions for biology groups exams
- Competitive Exams
- biology preparatory material and questions
- civils and groups exams
- appsc and tspsc
- state and central exams
- Education News
- Sakshi Education News
- Government Jobs