Biology Material for Groups Exams : ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో తెల్ల రక్తకణాలు సంఖ్య?
రక్తం, రక్త ప్రసరణ
మానవ శరీరంలో ముఖ్యమైన ద్రవం రక్తం. 70 కిలోల బరువున్న ఆరోగ్యవంతుడైన పురుషుడిలో 5–6 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం అధ్యయనం హెమటాలజీ. రక్తం ద్రవ రూపంలోని సంయోజక కణజాలం. ఆహార పదార్థాలు, శ్వాస వాయువులు, వ్యర్థాలు, హార్మోన్ల రవాణాను రక్తం నిర్వహిస్తుంది. తెల్ల రక్తకణాలు ఉండటం ద్వారా రక్తం శరీర నిరోధక శక్తిలో ΄ాల్గొంటుంది.
రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. అం దులో ఒకటి ΄్లాస్మా. ఇది రక్తంలోని ద్రవభాగం. రక్తంలో 55 శాతం ΄్లాస్మా ఉంటుంది. మిగిలిన 45 శాతం రక్తకణాలు ఉంటాయి. ΄్లాస్మాలో 92 శాతం నీరు, మిగిలిన 8 శాతం ఘనపదార్థాలు ఉంటాయి. ఈ ఘన పదార్థాల్లో ్ర΄÷టీన్లు, పిండి పదార్ధాలు, కొవ్వులు వంటివి కర్బన పదార్థాలు. ఖనిజాలన్నీ అకర్బన పదార్థాలు.
రక్తకణాలు
ఇవి మూడు రకాలు. అవి ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తఫలికికలు. రక్త కణాలు ఎముక మజ్జ నుంచి ఏర్పడుతాయి. పిండాభివృద్ధిలో వీ టిని కాలేయం ఏర్పరుస్తుంది. రక్తం, రక్తకణాలు ఏర్పడడాన్ని హీమో΄ాయిసస్ అంటారు. శరీరంలోని మరో ముఖ్యద్రవం శోషరసం. ఎర్రరక్తకణాలు లేని ద్రవం శోషరసం. శరీర కణజాలా ల మధ్య ప్రత్యేకనాళాల్లో శోషరసం ప్రవహిస్తుం ది. దీనిలో తెల్ల రక్తకణాలు ఉంటాయి కాబట్టి ఇదికూడా రోగనిరోధక శక్తిలో ΄ాల్గొంటుంది.
ఎర్ర రక్తకణాలు
ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో 4.5 నుంచి 5 మిలియన్ల ఎర్రరక్తకణాలు ఉంటాయి. శరీరంలో సుమారు 32 బిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎముక మజ్జలో ఇవి ఏర్పడడాన్ని ఎరిత్రో΄ాయిసిస్ అంటారు. ఇవి ద్విపుటా కారంలో ఉంటాయి. అభివృద్ధి చెందిన క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, ఇతర కణభాగాలు ఉండవు. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. హీమోగ్లోబిన్‌లో రెండు భాగాలు ఉంటాయి. అవి.. హీం, గ్లోబిన్. ఇనుమును ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కర్బన పదార్థం హీం. గ్లోబిన్ ఒక ్ర΄÷టీను. రక్తం ఎరుపురంగులో ఉండటానికి కారణమైన వర్ణకం హీమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్‌ల రవాణాను నిర్వహిస్తుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది. హీమోగ్లోబిన్ ఏర్పడడానికి, ఎర్రరక్తకణాలు అభివృద్ధి చెందడానికి ఇనుము, విటమిన్ బి12 (సైనకోబాలమిన్), విటమిన్ బి9 (ఫోలిక్ ఆమ్లం) అవసరమవుతాయి. ఆహారంలో ఇవి లోపిస్తే అనీమియా (రక్తహీనత) సంభవిస్తుంది. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఆ తర్వాత అవి ప్లీహంలో నశిస్తాయి.
☛Follow our YouTube Channel (Click Here)
తెల్ల రక్తకణాలు
వీటిని ల్యూకోసైట్లు అంటారు. శరీర రక్షక భటులుగా వ్యవహరిస్తాయి. వీటి జీవితకాలం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు. అవి.. గ్రాన్యులోసైట్లు, ఎగ్రాన్యులోసైట్లు. గ్రాన్యులోసైట్ల కణ ద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలు. అవి.. అసిడోఫిల్స్, బేసోఫి ల్స్, న్యూట్రోఫిల్స్. ఎగ్రాన్యులోసైట్లు రెండు రకా లు. అవి.. మోనోసైట్‌లు, అసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్. అలర్జీ చర్యల్లో ΄ాల్గొంటాయి. న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైనవి లింఫోసైట్లు. ఇవి రెండు రకాలు. అవి ఖీ, ఆ లింఫోసైట్లు. ఖీ లింఫోసైట్లు మళ్లీ రెండు రకాలు. అవి ఇఈ4/ఖీ4 కణాలు, ఇఈ8 కణాలు. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి దాన్ని నాశనం చేసే ప్రక్రియను ఖీ లింఫోసైట్‌లు ్ర΄ారంభిస్తాయి. వీటి ద్వారా సెల్యులార్ ఇమ్యూనిటీ లభిస్తుంది. వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతి దేహకాల (యాంటీ బాడీస్)ను విడుదల చేసి ఇమ్యూనిటీని అందించేవి ఆ లింఫోసైట్లు. ఈ రకమైన ఇమ్యూని టీ çహ్యుమొరల్ ఇమ్యూనిటీ. తెల్లరక్తకణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే ల్యుకేమియా లేదా రక్త కేన్సర్ వస్తుంది. వీటి సంఖ్య అసాధారణంగా తగ్గడం ల్యూకోపినియా.
రక్త ఫలకికలు
ఇవి నిజమైన కణాలు కాదు. ఎముక మజ్జలో మెగాక్యారియోసెట్‌ల నుంచి ఏర్పడిన ఖండితాలు. వీటి జీవితకాలం 3–10 రోజులు. ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో 2.5–5 లక్షలు ఉంటాయి. గాయమైనప్పుడు రక్త ççస్కందన ప్రక్రియను ్ర΄ారంభిస్తాయి. గాయమైన ్ర΄ాంతంలో ఇవి విచ్ఛిన్నం చెంది థ్రాంబో΄్లాస్టిన్ పదార్థాన్ని విడుదలచేస్తాయి. ఇవి రక్తంలోని ్ర΄÷థాంబిన్‌ను థ్రాంబిన్‌గా మారుస్తాయి. ఆ తర్వాత థ్రాంబిన్ చర్య ద్వారా రక్తంలోని ఫైబ్రినోజన్‌ను ఫైబ్రిన్‌గా మారుస్తాయి. ఫైబ్రిన్ ్ర΄÷టీన్ ΄ోగులుగా మారి సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చి రక్తం నష్టాన్ని నివారిస్తుంది. ఈ ప్రక్రియలో 13 ప్రధాన రక్తస్కందన కారకాలు, కొన్ని అనుబంధ కారకాలు ΄ాల్గొంటాయి. శరీరంలో రక్తం గడ్డకట్డడాన్ని హి΄ారిన్ నివారిస్తుంది. రక్త సంకోచానికి కావాల్సిన ఖనిజం కాల్షియం. అనుబంధ కారకాల్లో ముఖ్యమైంది విటమిన్ –కె. ఏ చిన్న దెబ్బ తగిలినా రక్తస్కంధనం జరగని వ్యాధి హీమోఫీలియా. కృత్రిమ రక్తస్కందన కారకాలుగా ఉపయోగించేవి సిట్రేట్‌లు, ఆక్సలేట్‌లు, డైకౌమరల్.
రక్త వర్గాలు
ఎర్రరక్తకణాల్లోని ప్రత్యేక ప్రతిజనకాల ఆధారంగా మానవ రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజించారు. అ, ఆ, ౖ రక్తవ్యవస్థను తొలిసారిగా ల్యాండ్‌స్టీనల్ గుర్తించారు. మానవ ఎర్రరక్తకణాలపై అ,ఆ ప్రతిజనకాలు ఉండటం లేదా లేక΄ోవడం ఆధారంగా మనుషులు నాలుగు వర్గాలు. అ గ్రూపు ఎర్రరక్తకణాల్లో అ అనే ప్రతిజనకం ఉంటుంది. ఆ గ్రూపు ఎర్ర రక్తకణాలపై ఆ ప్రతిజనకం ఉంటుంది. ఎర్ర రక్తకణాలపై అ, ఆ ప్రతిజనకాలు రెండూ ఉన్నవారు అఆ గ్రూపునకు చెందుతారు. ఈ రెండు ప్రతిజనకాలూ లేనివారు ౖ గ్రూపునకు చెందుతారు. అ గ్రూపు రక్తాన్ని ఆ గ్రూపు వారికి ఇస్తే అ ప్రతిజన కానికి విరుద్ధంగా ఆ వ్యక్తి శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై రక్తం గడ్డకడుతుంది. ఇది ్ర΄ాణాంతకం కూడా కావచ్చు. అదేవిధంగా ఆ గ్రూపు రక్తాన్ని అ గ్రూపు వారికి ఇస్తే ఇదే సమస్య వస్తుంది. కాబట్టి అ గ్రూపు వారికి అ గ్రూపు రక్తాన్ని, ఆ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తాన్ని ఇవ్వాలి. ఐతే వీరిద్దరికీ ౖ గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. అదేవిధంగా అఆ గ్రూపు వారికి అ, ఆ, ౖ, గ్రూపు రక్తాన్ని ఇవ్వొచ్చు. కాబట్టి అఆ గ్రూపు వారు విశ్వ గ్రహీతలు. ౖ గ్రూపు వారి రక్తాన్ని అందరికీ ఇవ్వొచ్చు. కాబట్టి వీరు విశ్వదాతలు. వీరికి మాత్రం ౖ గ్రూపు రక్తాన్నే ఇవ్వాలి. అఆ ప్రతిజనకాలకు అదనంగా మనిషి ఎర్ర రక్తకణాలపై ఖజి ప్రతిజనకాన్ని కూడా ల్యాండ్ స్టీనర్, వీనర్ గుర్తించారు. అఆౖ రక్త వ్యవస్థకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఎర్ర రక్తకణాలపై ఖజి ప్రతిజనకం ఉండొచ్చు లేదా ఉండక΄ోవచ్చు. దీన్ని కలిగి ఉన్నవారిని ఖజి ΄ాజిటివ్ అని, లేనివారిని ఖజి నెగిటివ్ అని సంబోధిస్తారు. అరుదుగా ఎవరిలో లేని ప్రతిజనకం కొందరి ఎర్రరక్తకణాల్లో ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ బాంబే ప్రతిజనకం. బాంబే రక్త గ్రూపునకు చెందినవారిలో బాంబే ప్రతిజనకం (ఏ) ఉంటుంది.
☛ Follow our Instagram Page (Click Here)
గుండె, రక్త ప్రసరణ
శరీరంలో రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అకశేరుకాల్లో నాడీ జనిత, సకశేరుకాలలో కండర జనిత గుండె ఉంటుంది. మనిషిలో నాలుగు గదుల గుండె ఉంటుంది. ఊపిరితిత్తుల మధ్యలో మీడియా స్టీనియం అనే కుహరంలో గుండె అమరి ఉంటుంది. గుండెలోని పై గదులు కర్ణికలు. కింది గదులు జఠరికలు. గుండె లయ ఒక కండర కణుపులో మొదలవుతుంది. దీన్ని లయారంభకం అంటారు. మానవుడి గుండెలో రెండు లయారంభకాలు ఉంటాయి. సిరాకర్ణికా కణుపు గుండె కుడికర్ణిక కుడివైపు పై భాగంలో ఉంటుంది. రెండోది కర్ణికా జఠరికా కణుపు. ఇది కుడి కర్ణిక, కుడి జఠరిక మధ్య ఉంటుంది. సిరా కర్ణికా కణుపు వద్ద జనించిన సంకోచ తరంగాలు కర్ణికలకు మాత్రమే పరిమితమవుతాయి. దీని నుంచి సంకోచ తరంగాలను అందుకున్న కర్ణిక, జఠరిక కణుపు హిస్ కండరకట్ట ద్వారా జఠరికలకు చేరుతాయి. ఈ విధంగా మొత్తం గుండె సంకోచిస్తుంది. గుండె సంకోచం సిస్టోల్. గుండె సడలిక డయాస్టోల్. కర్ణికల సంకోచం ద్వారా రక్తం జఠరికల్లోకి చేరుతుంది. జఠరికల సంకోచం ద్వారా మళ్లీ రక్తం కర్ణికల్లోకి చేరకుండా ప్రత్యేక కవాటాలు అడ్డుకుంటాయి. ఎడమ కర్ణిక, జఠరికల మధ్య అగ్రద్వయ లేదా మిట్రల్ కవాటం; కుడి కర్ణిక, జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటాయి.
సిరలు
శరీరంలోని సిరలు వివిధ భాగాల నుంచి సేకరించిన మలిన/ ఆమ్లజని రహిత రక్తాన్ని ఊర్థ్వ, నిమ్న మహా సిరల ద్వారా గుండె కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. ఐతే ఒక్క పుపుస సిర మాత్రమే ఊపిరితిత్తుల నుంచి శుద్ధ/ ఆమ్లజని సహిత రక్తాన్ని ఎడమ కర్ణికలోకి విడుదల చేస్తుంది. కర్ణికలు సంకోచిస్తాయి. జఠరికల్లోకి రక్తం చేరుతుంది. ఎడమ జఠరికలోకి చేరిన శుద్ధ రక్తం మహాధమని ద్వారా శరీరంలోని ధమనుల్లోకి చేరుతుంది. కుడి కర్ణికలోకి చేరిన మలిన రక్తం ఒక పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ విధంగా శరీరంలోని ధమనులన్నీ గుండె ఎడమ జఠరిక నుంచి శుద్ధ రక్తాన్ని అన్ని శరీర భాగాలకూ సరఫరా చేస్తాయి. ఒక పుపుస ధమని మాత్రమే గుండె కుడి జఠరిక నుంచి మలిన రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. ఈ రకంగా గుండె కుడి భాగంలో మలిన రక్తం, ఎడమ భాగంలో శుద్ధ రక్తం స్వతంత్రంగా సరఫరా కావడం ద్విరక్త ప్రసరణ.
ప్రాక్టీస్ క్వశ్చన్స్:
1. ప్రతి 100 మి.లీ. రక్తంలో హీమోగ్లోబిన్ ఏ మోతాదులో ఉంటుంది?
ఎ) 15 గ్రాములు బి) 15 మిల్లీ గ్రాములు
సి) 25 గ్రాములు డి) 25 మిల్లీ గ్రాములు
2. ఎముక మజ్జ నుంచి రక్తం, రక్త కణాలు ఏర్పడని జన్యువ్యాధి?
ఎ) హీమోఫీలియా బి) థలసీమియా
సి) ΄ాలిసైథామియా డి) అడిసిన్స్
3. విటమిన్ బి12 లోపం ద్వారా సంభవించే రక్తహీనత?
ఎ) మెగలోబ్లాస్టిక్ బి) మాక్రోసిస్టిక్
సి) పెర్నిసియస్ డి) న్యూట్రిషినల్
4. మానవుడిలో ఎర్ర, తెల్ల రక్తకణాల నిష్పత్తి?
ఎ) 1:600 బి) 600:1
సి) 6000:1 డి) 1:6000
5. రక్తం రసాయన గుణం?
ఎ) స్వల్పక్షారం బి) మోస్తరు క్షారం
సి) స్వల్ప ఆమ్లం డి) మోస్తరు ఆమ్లం
☛ Join our WhatsApp Channel (Click Here)
6. ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో తెల్ల రక్తకణాలు సంఖ్య?
ఎ) 8000– 12,000 బి) 2– 2.5 లక్షలు
సి) 3.0– 3.5 మిలియన్‌లు
డి) 3,000– 5,000
7. తెల్ల రక్తకణాలలో ఎక్కువగా ఉండేవి?
ఎ) అసిడోఫిల్స్ బి) బేసోఫిల్స్
సి) న్యూట్రోఫిల్స్ డి) మోనోసైట్‌లు
8. దోమ లాలాజలంలో రక్తస్కందన నివారిణి?
ఎ) హీమోలైసిన్ బి) హిరుడిన్
సి) లైసోజైం డి) అల్బుమిన్
9. బాంబే ప్రతిజనకం?
ఎ) ఏ బి) M సి) N డి) p
10. కింది ఏ జంటకు కలిగే రెండు వరుస ఖజి ΄ాజిటివ్ శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది?
ఎ) ఖజి+ పురుషుడు, ఖజిృ స్త్రీ
బి) ఖజిృ పురుషుడు, ఖజి+ స్త్రీ
సి) ఖజి+ పురుషుడు, ఖజి+ స్త్రీ
డి) ఖజిృ పురుషుడు, ఖజి+ స్త్రీ
11. వీటిలో ఏ అవయవం తొలగించినప్పటికీ ఏ సమస్యా ఉండదు?
ఎ) ప్లీహం బి) కాలేయం
సి) ఊపిరితిత్తులు డి) పీయూష గ్రంథి
12. రక్తనాళాల్లో రక్తప్రవాహ వేగాన్ని కొలిచే పరికరం?
ఎ) ఈసీజీ బి) స్పిగ్మామానోమీటరు
సి) స్ట్రోమరు డి) ఈఈజీ
13. కర్ణికల సంకోచం (సిస్టోల్)కు పట్టే సమయం?
ఎ) 0.1 సెకను బి) 0.3 సెకను
సి) 0.5 సెకను డి) 0.8 సెకను
14. రక్త నాళాల అధ్యయనం?
ఎ) కైనిసియాలజీ బి) సిన్‌డెస్మాలజీ
సి) ఆంజియాలజీ డి) ట్రైకాలజీ
15. గుండె వేగం అసాధారణంగా పెరగడం?
ఎ) టేకీకార్డియా బి) బ్రేడీ కార్డియా
సి) ఎరిథిమియా డి) ఏదీకాదు
☛ Join our Telegram Channel (Click Here)
16. గుండె లయలో లబ్ శబ్దానికి కారణం?
ఎ) కర్ణికల సంకోచం
బి) జఠరికల సంకోచం
సి) కర్ణిక–జఠరిక కవాటాలు మూసు కోవడం
డి) అర్ధ చంద్రాకార కవాటాలు మూసు కోవడం
17. హెచ్‌ఐవి ప్రత్యేకంగా దాడిచేసే తెల్ల రక్తకణాలు?
ఎ) బి – లింఫోసైట్‌లు బి) ఇఈ4 కణాలు
సి) ఇఈ8 కణాలు డి) మోనోసైట్‌లు
18. కృత్రిమంగా రూ΄÷ందిన గుండె?
ఎ) టెక్నోకోర్ బి) అబియోకోర్
సి) కార్డియోకోర్ డి) ఏదీకాదు
19. పురుషుడి గుండె బరువుతో ΄ోలిస్తే స్త్రీ గుండె బరువు ఎంత శాతం తక్కువ ఉంటుంది?
ఎ) 50 బి) 25 సి) 10 డి) 2
20. శోషరసంలో లేనివి?
ఎ) తెల్ల రక్తకణాలు బి) ఎర్రరక్తకణాలు
సి) ΄్లాస్మా డి) పైవన్నీ
21. రక్త పరిమాణాన్ని నియంత్రించే అవయవం?
ఎ) కాలేయం బి) మూత్రపిండం
సి) ప్లీహం డి) పైవన్నీ
22. సీరంలో లేనివి?
ఎ) ఎర్రరక్తకణాలు బి) తెల్ల రక్తకణాలు
సి) రక్త ఫలికలు డి) పైవన్నీ
23. భారత్‌లో ఎక్కువ మంది ప్రజలు ఏ రక్త గ్రూపునకు చెందినవారు?
ఎ) ఎ బి) బి సి) ఎబి డి) ఒ
24. రక్త స్కందన నివారిణిగా ఉపయోగప డేవి?
ఎ) ΄÷టాషియం ఆక్సలేట్
బి) అమ్మోనియం ఆక్సలేట్
సి) డై కౌమరల్ డి) పైవన్నీ
25. సిరలకు సంబంధించిన రుగ్మత?
ఎ) అథెరోస్కి›్లరోసిస్
బి) స్కిజోఫ్రినియా సి) వారికోస్
డి) అల్జిమర్స్
సమాధానాలు
1) ఎ; 2) బి; 3) సి; 4) బి; 5) ఎ 6) ఎ; 7) సి; 8) ఎ; 9) ఎ; 10) ఎ; 11) ఎ; 12) సి; 13) ఎ; 14) సి; 15) ఎ; 16) సి;17) బి; 18) బి; 19) బి; 20) బి; 21) సి; 22) డి; 23) బి; 24) డి; 25) సి
Tags
- biology material and model questions
- material for competitive exams
- study material and practice questions
- study material and practice questions for biology exam
- Competitive Exams
- APPSC
- TSPSC
- groups exams
- groups exams preparations
- Government jobs exams
- Education News
- Sakshi Education News
- biologystudymaterials