Biology Material for Groups Exams : అతి పొడవైన కణాలను కలిగిన కణజాలం ఏది?
కణజాలాలు
జీవుల్లో నిర్మాణాత్మక, క్రియాత్మక ఆధార ప్రమాణం కణం. అనేక కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. కణజాలాలు కలిసి వివిధ అవయవాలను, అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. వివిధ వ్యవస్థల సముదాయమే జీవి. మొక్క లేదా జంతువు రూపోందేందుకు మొదట రెండు కణాల సంయోగం జరిగి సంయుక్త బీజకణం (జైగోట్) ఏర్పడుతుంది. అది అనేక మార్పులకు (విభజనలు) గురై మొక్క లేదా జంతువుగా మారుతుంది. ఈ క్రమంలో వివిధ రకాల కణాలు కలిసి వివిధ రకాలైన కణజాలాలను ఏర్పరుస్తాయి. కణజాలాలు మొక్కల్లో, జంతువుల్లో నిర్మాణాలు, వాటి పనితీరును బట్టి వివిధ రకాలుగా ఉన్నాయి. కణజాలాల అధ్యయనాన్ని హిస్టాలజీ అంటారు. కణజాలం (టిష్యూ) అనే పదాన్ని మొదటవాడింది బిచాట్.
మొక్కల్లో కణజాలం
మొక్కల్లో సాధారణంగా మూడు రకాల కణజాలాలు ఉంటాయి. అవి..
1. సరళ కణజాలం
2. సంక్లిష్ట కణజాలం
3. ప్రత్యేక కణజాలం
1. సరళ కణజాలం: నిర్మాణం, విధుల్లో ఒకే విధంగా ఉండే కణాల సముదాయాన్ని సరళ కణజాలం అంటారు. ఇది మొక్కల్లో ఎక్కువ శాతం ఉండే కణజాలం. దీనిలో
ఎ. మృదు కణజాలం
బి. స్థూలకోణ కణజాలం
సి) దృఢ కణజాలం అనే రకాలుంటాయి.
మృదు కణజాలం: మొక్కల్లోని లేత, మెత్తని భాగాల్లో, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విత్తనాల్లో ఎక్కువగా ఉంటుంది. మృదు కణజాలం గాయాలను మాన్పడానికి, అంట్లు కట్టినప్పుడు, పునరుద్భవం మొదలైన అంశాల్లో దోహదపడుతుంది. కణజాల వర్థనంలో అసంఖ్యాకంగా మొక్కలు ఏర్పడటానికి ఇది తోడ్పడుతుంది.
స్థూల కోణ కణజాలం (కోలెన్‌ఖైమా): ఇది ఎక్కువగా లేత కాండాలు, పత్ర వృంతాలు, పుష్ప వృంతాలు, పత్రాల అంచులు, ఈనెలు మొదలైన భాగాల్లో ఉంటుంది. ఏక దళ బీజ మొక్కల కాండం, పత్రాల్లో ఉండదు. ఈ కణాలు వివిధ ఆకృతులతో ఉంటాయి. వీటి కణ కవచం ప్రత్యేకత ఏమిటంటే సెల్యూలోజ్, పెక్టిన్‌తో నిర్మితమై ఉంటుంది. కణ కవచంలో 60 శాతం నీరు ఉంటుంది. స్థూల కోణ కణజాలం మొక్కల భాగాలకు సమ్యత (Flexibility), స్థితిస్థాపకతను కలగజేయడం వల్ల వృంత భాగాలు సులువుగా వంగుతాయి. పత్ర, పుష్ప వృంతాలు వంటి సున్నిత భాగాలు ప్రతిబలాన్ని (Stress), ప్రయాస (Strain) ను ఎదుర్కొంటాయి. పత్రాల పై భాగాన ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటానికి కారణం స్థూల కోణ కణజాలమే.
☛Follow our YouTube Channel (Click Here)
దృఢ కణజాలం: ఇది నిర్జీవ సరళ యాంత్రిక కణజాలం. ఇది మొక్కల భాగాలకు యాంత్రిక బలాన్ని, గట్టిదనాన్ని కలుగజేస్తుంది. ఇది ఎక్కువగా ఎడారి మొక్కల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. వీటి కణ కవచాలు లిగ్నిన్‌తో నిర్మితమై ఉంటాయి. నారలు, శిలా కణాలు ఈ కణజాలానికి చెందినవే. అతి ΄÷డవైన నారలు.. రామి నారలు (బొహెమిరియా నీవియా). నారల్లో సెల్యూలోజ్ ఉన్న వాటిని ఫ్లాక్స్ నారలు అంటారు. ఇవి వాణిజ్య పరంగా విలువైనవి. ఫ్లాక్స్ నారలు, హెంప్, రామినారల్లో లిగ్నిక్ ఉండదు.
కండ ఉన్న ఫలాలు, విత్తనాలు మొదలైన వాటిలో శిలా కణాలు ఎక్కువగా ఉంటాయి. ఉదా: కొబ్బరి, యాపిల్, పియర్.
2. సంక్లిష్ట కణజాలం: భిన్న రకాలైన కణాలు కలిసి ఒకే పనిని నిర్వర్తించేందుకు ఏర్పడే కణజాలం ఇది. ముఖ్యంగా మొక్కల్లో నీటిని, ఖనిజ మూలకాలను, ఆహార పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగపడుతుంది. సంక్లిష్ట కణజాలంలో 1) దారువు (Xylem) 2) ΄ోషక కణజాలం (Phloem) అనే రెండు రకాలుంటాయి. దారువును హైడ్రోమ్ అని కూడా అంటారు. ఇది నీటిని, ఖనిజ మూలకాలను మొక్కకు రవాణా చేస్తుంది. దీనిలో దారు కణాలు, దారు నారలు, దారు నాళాలు, దారు మృదు కణాలు మొదలైనవి ఉంటాయి. దారువులో ఉండే కణాలు లిగ్నిన్ కణ కవచాలను కలిగి, కేంద్రకం లేకుండా నిర్జీవంగా ఉంటాయి. ఇవి మొక్కకు భౌతిక ఆధారాన్ని, దృఢత్వాన్ని ఇస్తాయి. పరిణతి చెందిన వృక్షాల్లో దారు నాళాల్లోకి బెలూన్ల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని పైలోసిస్‌లు అంటారు. ఇవి కాండందృఢత్వాన్ని పెంచుతాయి. కలప ఎక్కువ మన్నిక ఉంది అనడానికి కారణం టైలోసిస్‌లు ఏర్పడటమే.
పోషక కణజాలాన్ని లెప్టోమ్ అని కూడా అంటారు. ఇది ఆహార పదార్థాలను మొక్క అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. దీనిలో చాలనీ కణాలు, చాలనీ నాళాలు, సహకణాలు, నారలు, మృదు కణాలు మొదలైనవి ఉంటాయి. మొక్కల్లో కేంద్రక రహిత సజీవ కణాలు చాలనీ నాళాలు (ఆర్‌బీసీ మాదిరిగా). కణాల మధ్య కణ ద్రవ్య పోగులు (ప్లాస్మా డెస్మెటా) కన్వేయర్ బెల్టుల మాదిరిగా పనిచేస్తాయి.
3. ప్రత్యేక కణజాలం: విభిన్న కణాలు విభిన్న ప్రక్రియలను జరిపే కణజాలాన్ని ప్రత్యేక కణజాలం అంటారు. ఇది ముఖ్యంగా స్రావక క్రియలో తోడ్పడుతుంది. కీటకాహార మొక్కల్లో జీర్ణరసాలను స్రవించేందుకు జీర్ణగ్రంథులుంటాయి. ఇవి కీటకాలను జీర్ణం చేసేందుకు ప్రోటిమోలైటిక్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. తేనెటీగలు గ్రహించే మకరందం పుప్పాల్లో ఉండే మకరంద గ్రంథుల నుంచి వస్తుంది.
కొన్ని మొక్కలు సుగంధ పరిమళాన్ని వెదజల్లుతాయి. దీనికి కారణం ఆస్మోఫోర్‌లు. పైనస్ వంటి మొక్కల్లో రెసిన్లను ఉత్పత్తి చేసేది స్రావక కుహారాలు. శీతాకాలంలో కొన్ని మొక్కలు ఉదా: గడ్డి, టమాటా వంటి మొక్కల పత్రాల చివరి భాగం నుంచి నీరు బిందువుల రూపంలో వెలువడుతుంది. దీన్నే బిందుస్రావం (Guttation) అంటారు. ఇది జరిగేందుకు హైడథోడ్స్ (జలగ్రంథులు) తోడ్పడతాయి. కొన్ని మొక్కల్లో వాటిని గిల్లినప్పుడు తెల్లని పాల వంటి పదార్థం వెలువడుతుంది. దీన్నే లేటెక్స్ అంటారు. దీన్ని ఉత్పత్తి చేసే కణజాలం లాటిసి ఫెరస్ కణజాలం. లేటెక్స్ నుంచి రబ్బర్‌ను తయారు చేస్తారు. హీవియా బ్రెజిలియన్సిస్ నుంచి ΄ారా రబ్బర్, ఫైకస్ ఎలాస్టికా నుంచి ఇండియన్ రబ్బర్‌ను తయారు చేస్తారు.
☛ Follow our Instagram Page (Click Here)
కణజాల వ్యవస్థలు: మొక్క భాగాలను వేరు, కాండం, పత్రం వంటి వాటిని ఛేదించినప్పుడు వాటిలో వివిధ రకాల కణజాలాలు వివిధ రీతుల్లో కనిపిస్తాయి. సాధారణంగా వెలుపలి వరుసలో బాహ్య చర్మం, మధ్యలో వల్కలం, లోపలి తలంలో ప్రసరణ స్తంభం అనే భాగాలుంటాయి.
వేరు బాహ్య చర్మంలోని కేశాలు నీటిని శోషించేందుకు, కాండంలోని బాహ్య చర్మ కేశాలు రక్షణకు తోడ్పడతాయి. పత్రం బాహ్య చర్మంలో పత్ర రంధ్రాలుంటాయి. పత్ర రంధ్రాలుండే భాగంలో రక్షక కణాలుంటాయి. పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి అవడాన్ని భాష్పోత్సేకం అంటారు. వేరు, కాండం వంటి భాగాల్లో వల్కలం అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా పదార్థాల రవాణా నిల్వలో తోడ్పడుతుంది. ప్రసరణ స్తంభంలో దారువు, పోషక కణజాలం ఉంటాయి. సాధారణంగా వేరులో బాహ్య ప్రథమ దారుకం (Exarch), కాండంలో అంతర ప్రథమ దారుకం (Endwich) స్థితులు ఉంటాయి.
వృక్షాల కాండాలు బాగా వృద్ధి (లావెక్కడం) చెందడాన్ని ద్వితీయ వృద్ధి అంటారు. దీనిలో వార్షిక వలయాలు ఏర్పడతాయి. వీటి సంఖ్యను బట్టి వృక్షాల వయసును లెక్కిస్తారు. కాండం మధ్యలో ముదురు రంగులో ఉన్న భాగాన్ని డ్యురామెన్ అని, లేత రంగులో ఉన్న భాగాన్ని అల్బర్నం అంటారు. వెలుపలి భాగాన పొలుసుల మాదిరిగా ఏర్పడిన దాన్ని బెరడు అంటారు. బాగా వృద్ధి చెందిన వృక్షాల పై భాగాన సూక్ష్మ రంధ్రాలు ఏర్పడతాయి. వీటినే వాయురంధ్రాలు అంటారు.
జంతువుల్లో
జంతువుల్లో కణజాలాలు పని చేసే విధానాన్ని బట్టి నాలుగు రకాలు.
1. ఉపకళా కణజాలం
2. సంయోజక కణజాలం
3. కండర కణజాలం
4. నాడీ కణజాలం
1. ఉపకళా కణజాలం (ఎపిథీలియల్): ఇది ముఖ్యంగా శరీర బాహ్య తలంలోనూ, శరీరంలోని వివిధ అంగాల బాహ్య, అంతర తలాల్లోనూ పొర మాదిరిగా ఉంటుంది. ఉదా: చర్మం.
వెంట్రుకలు, గోళ్లు, కొమ్ములు మొదలైనవి ఉపకళా కణజాలాలతో నిర్మితమైనవే. ఇవి బాహ్య ప్రేరణను కూడా కలుగజేస్తాయి. ఉప కళాకణజాలంలో కణాలు ఘనాకారంలో, స్తంభాకారంలో, మరికొన్ని శైలికలను కలిగి ఉంటాయి. ఉదా: జీర్ణాశయంలో శైలికల వంటి నిర్మాణాలు ఆహార పదార్థాలను కదిలించేందుకు తోడ్పడతాయి. వివిధ రకాలైన హార్మోన్‌లను, రసాయన పదార్థాలను స్రవించడంలో కూడా ఉపయోగపడతాయి.
2. సంయోజక కణజాలం: ఇది వివిధ కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది. శరీర రక్షణ, శరీర భాగాలను బాగు చేయడంలో ఉపయోగపడుతుంది. కొవ్వులను నిల్వ చేయడం మొదలైన పనులను నిర్వర్తిస్తుంది. వివిధ కణజాలాలను కలిపే కణజాలం ఏరిమోలార్ కణజాలం. దెబ్బతిన్న భాగాలను బాగు చేసేది ఏరిమోలార్ కణజాలమే.
మృదులాస్థి అనేది మరొక సంయోజక కణజాలం. ఇది ఎముకల చివర చెవిదొప్ప, వాయునాళం, ముక్కు మొదలైన భాగాల్లో ఉంటుంది. పిండ దశలో ఎక్కువగా ఉండేవి మృదులాస్థులే. వీటిలోని కణాలను ఆస్టియోసైట్స్ అంటారు. ఎముక నిర్మాణానికి కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బొనేట్‌లు అవసరం. వీటిని అస్థిమజ్జలో ఉండే ఆస్టియోసైట్స్ స్రవిస్తాయి.
☛ Join our WhatsApp Channel (Click Here)
లిగమెంట్ అనేది ఎముకను మరొక ఎముకతో కలిపి ఉంచే ఒక సంయోజక కణజాలం. ఇది కొల్లాజెన్ అనే ్ర΄ోటీన్‌తో తయారై ఉంటుంది. టిండాన్ (స్నాయుబంధనం) అనేది ఎముకను, కండరాన్ని కలిపి ఉంచే మరొక సంయోజక కణజాలం. ఎడిపోస్ కణజాలం అనేది కొవ్వును నిల్వ చేస్తుంది. ఇది ఉపవాసం సమయంలో శరీరానికి శక్తిని సమకూరుస్తుంది. అదే మాదిరిగా శరీరంలోని వేడిని బయటకు పోకుండా చేస్తుంది.
రక్తం కూడా ఒక సంయోజక కణజాలం. దీనిలో ప్లాస్మా అనే ద్రవ పదార్థ రక్త కణాలు ఉంటాయి. ప్లాస్మాలో అనేక రకాల ఆహార పదార్థాలు, లాక్టిక్ ఆమ్లం, యూరియా వంటి విసర్జక పదార్థాలు, హె΄ారిన్, ప్రోథ్రాంబిన్ వంటి ప్రోటీన్స్ మొదలైనవి ఉంటాయి.
రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, థ్రాంబోసైట్స్ అనే మూడు రకాల కణాలుంటాయి. ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం ఉండదు కానీ చేపలు, ఉభయ చరాలు, సరీసృపాలు, గుర్రం వంటి వాటిలో కేంద్రాన్ని కలిగిన ఎర్ర రక్త కణాలుంటాయి. ఇవి O2, CO2 రవాణాలో తోడ్పడతాయి.
తెల్ల రక్తకణాలు కేంద్రకాన్ని కలిగి వివిధ రీతుల్లో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రక్త ఫలకికలు (థ్రాంబోసైట్లు) కేంద్ర రహితం. ఇవి రక్తాన్ని గడ్డ కట్టించేందుకు తోడ్పడతాయి.
3. కండర కణజాలం: శరీరంలోని దాదాపు ఎక్కువ భాగాలు కండర కణజాలంతో నిర్మితమై ఉంటాయి. పూర్తిగా కండర కణజాలంతో నిర్మితమైంది గుండె, నాలుక మొదలైన కండరాలు వివిధ భాగాల చలనానికి తోడ్పడతాయి. కండరాలు ముఖ్యంగా మూడు రకాలు.
1. రేఖీత కండరాలు
2. అరేఖిత కండరాలు
3. హృదయ కండరాలు
రేఖిత కండరాలు: ఇవి ఎముకకు అతుక్కొని ఉంటాయి. ఇవి కదలికలో తోడ్పడతాయి. ఇవి మన ఆధీనంలో ఉండే కదలికలను కలుగజేస్తాయి. కాబట్టి వీటిని నియంత్రిత లేదా ఐచ్ఛిక లేదా సంకల్పిత కండరాలు అని అంటారు.
అరేఖిత కండరాలు: ఇవి మన ఆధీనంలో లేని కదలికలను కలిగిస్తాయి. కాబట్టి వీటిని అనియంత్రిత కండరాలు అని అంటారు. రక్తనాళాలు, పేగు మొదలైన వాటిలో ఉంటాయి.
మాదిరి ప్రశ్నలు
1. శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలు ఏర్పడేందుకు అవసరమైనవి?
1) కణాలు 2) కణజాలం
3) కేంద్రకం 4) కణాంగాలు
2. నిరంతరం కణ విభజన జరపని కణజాలం?
1) హృదయ కండరం 2) అస్థి కణజాలం
3) 1, 2 4) కండర కణజాలం
3. అతి పొడవైన కణాలను కలిగిన కణజాలం?
1) కండర కణజాలం
2) ఎడిపోజ్ కణజాలం
3) నాడీ కణజాలం
4) సంయోజక కణజాలం
4. పేగు గోడలపై ఉండే కణజాలం?
1) సంయోజక కణజాలం
2) ఉప కళా కణజాలం
3) కండర కణజాలం
4) నాడీ కణజాలం
☛ Join our Telegram Channel (Click Here)
5. అసంకల్పిత చర్యలను జరిపే కండరాలు?
1) హృదయ కండరాలు
2) రేఖిత కండరాలు
3) అరేఖిత కండరాలు 4) 1, 3
6. మొక్కల్లో నీటిని, ఖనిజ మూలకాలను రవాణా చేసే కణజాలం?
1) సరళ కణజాలం 2) సంక్లిష్ట కణజాలం
3) ప్రత్యేక కణజాలం 4) 1, 3
7. వృక్షాల్లో వాటి వయసును కొలవడానికి ఉపయోగపడే వార్షిక వలయాల్లో ఉండే కణజాలం?
1) దారువు 2) పోషక కణజాలం
3) దవ్వ 4) బాహ్య చర్మం
సమాధానాలు
1) 2; 2) 1; 3) 3; 4) 2;
5) 4; 6) 2; 7) 1.
Tags
- biology material for groups exams
- appsc and tspsc groups exam study material
- biology model questions
- biology model questions for groups exams
- groups exams preparations
- bit bank and study material for biology
- bit banks of biology for groups exams
- tissues in plants and humans
- tissues in plants for groups exams
- Education News
- Sakshi Education News