DNA Finger Printing in Biology : డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్‌లో ఉపయోగించే రక్త కణాలు?
రక్త ప్రసరణ వ్యవస్థ
తెల్ల రక్త కణాలు (ల్యూకోసైట్స్ / డబ్ల్యూబీసీ)
తెల్ల రక్త కణాలను ఫాగోసైట్స్, శరీర రక్షక భటులు (బాడీ సోల్జర్స్), శ్వేత రక్త కణాలు అని కూడా అంటారు. రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను తెల్ల రక్తకణాలు చంపి దేహాన్ని కాపాడతాయి. కాబట్టి వీటిని శరీర రక్షక భటులు, లేదా రక్తంలోని పారిశుద్ధ్య పనివారు అని అంటారు.
➾ ల్యూకోపాయిసిస్ అంటే తెల్ల రక్తకణాల ఉత్పత్తి.
➾ ల్యూకోలైసిస్ అంటే తెల్ల రక్తకణాల విచ్ఛిత్తి.
➾ ల్యూకోపేనియా అంటే తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా తగ్గడం.
➾ ల్యూకేమియా (ల్యుకోసైథీమియా) అంటే తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడం (బ్లడ్ క్యాన్సర్).
➾ శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను ఎదుర్కొనే క్రమంలో చని΄ోయిన తెల్ల రక్తకణాలు చీము రూపంలో బయటకు విసర్జితమవుతాయి.
➾ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్‌కు తెల్ల రక్తకణాలను ఉపయోగిస్తారు.
ఉపయోగం: నేర పరిశోధన, మాతృ, పితృత్వ వివాదాల పరిష్కారం.
➾ తెల్ల రక్తణాలు గుండ్రంగా ఉంటాయి.
➾ వీటిలో కేంద్రం ఉంటుంది.
➾ కాలేయం, ప్లీహం (లింప్ గ్రంథి), థైమస్ గ్రంథి (బాల గ్రంథి),దీర్ఘ అస్థిమజ్జ నుంచి తెల్లరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి.
➾ క్యూబిక్ మి.లీ. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య 5000–9000 (5–9 × 10-3)
➾ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల నిష్పత్తి 500 : 1
➾ తెల్ల రక్తకణాలు కాలేయం, ప్లీహంలో విచ్ఛిన్నమవుతాయి.
తెల్ల రక్తకణాలు ప్రధానంగా రెండు రకాలు. అవి..
ఎ)గ్రాన్యులోసైట్స్, బి) ఎగ్రాన్యులో సైట్స్
గ్రాన్యులోసైట్స్
ఈ డబ్ల్యూబీసీల జీవ పదార్థంలో రేణువులు (గ్రాన్యుల్స్) ఉంటాయి. మొత్తం డబ్ల్యూబీసీల్లో గ్రాన్యులోసైట్స్ 70 శాతం వరకు ఉంటాయి. వీటిలో కేంద్రకం భిన్న రూపాల్లో ఉంటుంది. కాబట్టి వీటిని బహురూపక కేంద్రక తెల్ల రక్తకణాలు అంటారు. గ్రాన్యులో సైట్స్‌ని తిరిగి మూడు రకాలుగా వర్గీకరిస్తారు.
1) ఇసినోఫిల్స్ (అసిడోఫిల్స్)
2) బేసోíఫిల్స్
3) న్యూట్రోఫిల్స్
ఇసినోఫిల్స్
ఈ కణాలు ఆమ్ల రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. వీటి కేంద్రకంలో రెండు తమ్మెలు ఉంటాయి. జీవ పదార్థంలో అతిపెద్ద కణికలుంటాయి. మొత్తం తెల్ల రక్తకణాల్లో వీటి సంఖ్య 2 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. ఇసినోఫిల్స్ జీవిత కాలం 7 నుంచి 12 రోజులు.
విధులు
➾ ఇసినోఫిల్స్ ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి.
➾ శరీరంలో ప్రవేశించిన విషపదార్థాలను నాశనం చేస్తాయి.
➾ ఎలర్జీ కారకాలకు వ్యతిరేకంగా ΄ోరాడుతాయి. ఈ సమయంలో ఇసినోఫిల్స్ సంఖ్య విపరీతంగా పెరగడాన్ని ఇసినోఫిలియా అంటారు.
➾ ఎలర్జీని కలిగించే మొక్కలు
1) అర్టకేరియా
2) పార్దీనియం హిస్టిరోఫోరస్ (వయ్యారిభామ/కాంగ్రెస్ గడ్డి )
➾ ఈ మొక్కల పరాగ రేణువుల వల్ల వచ్చే జ్వరాన్ని హైఫీవర్ అంటారు.
➾ ఎలర్జీని కలిగించే కారకాన్ని ఎలర్జీన్ అంటారు.
ఉదా: పరాగరేణువులు, దుమ్ము, సెంట్, లిప్‌స్టిక్ మొదలైనవి.
బేసోఫిల్స్
ఈ కణాలు క్షార రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. కేంద్రకం ఎస్ (S) ఆకారంలో ఉంటుంది. తెల్ల రక్తకణాలన్నింటి కంటే వీటి సంఖ్య చాలా తక్కువ (0.4 శాతం).
➾ వీటి జీవిత కాలం 12 నుంచి 15 రోజులు
➾ పుండ్లు, గాయాలను మాన్పడంలో ఈ కణాలు తోడ్పడుతాయి.
న్యూట్రోఫిల్స్
ఈ కణాలు తటస్థ రంజకాలతో రంగును సంతరించుకుంటాయి. కేంద్రకం అనేక తమ్మెలను (ఐదు లేక ఆరు) కలిగి ఉంటుంది.
➾ తెల్ల రక్తకణాలన్నింటి కంటే వీటి సంఖ్య చాలా ఎక్కువ (60–65 శాతం).
➾ వీటి జీవిత కాలం 2 నుంచి 5 రోజులు.
➾ శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాలను చంప డం వల్ల వీటిని సూక్ష్మ రక్షక భటులు (మైక్రో ΄ోలీస్‌మెన్) అంటారు.
➾ బ్యాక్టీరియాల నుంచి శరీరాన్ని రక్షించడం వల్ల వీటిని మొదటి వరుస రక్షకులు అంటారు.
➾ డబ్ల్యూబీసీల్లోని ఏ ఇతర కణాన్ని అయినా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి న్యూట్రోఫిల్స్‌ను బహు రూపక తెల్ల రక్తకణాలు (ప్లియోమార్పిక్ సెల్స్) అంటారు.
➾ బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ భక్షణ క్రియలో ΄ాల్గొని లైసోసోమ్స్ అనే కణాంగాల సహాయంతో సూక్ష్మజీవులను చంపే (భక్షణ) ప్రక్రియను ఫాగోసైటాసిస్ అంటారు.
ఎగ్రాన్యులో సైట్స్
ఈ కణాల జీవపదార్థంలో రేణువులు (గ్రాన్యుల్స్) ఉండవు. ఇవి తిరిగి రెండు రకాలు..
1) లింపోసైట్స్ 2) మోనోసైట్స్.
లింపోసైట్స్
తెల్ల రక్త కణాలన్నింటిలోకి అతి ప్రధానమైనవి. ఇవి మిగతా తెల్ల రక్తకణాల విధులను నియంత్రిస్తాయి. ఇవి శరీరంలోకి వచ్చిన ప్రతి జనకాల (యాంటీజెన్)ను గుర్తించి వాటికి వ్యతిరేక ప్రతిరక్షకాల(యాంటీబాడీస్)ను ఉత్పత్తి చేసి అసంక్రామ్యత (రోగనిరోధక శక్తి)ని పెంచుతాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే అతి ముఖ్యమైన కణాలుగా లింపోసైట్లను పరిగణిస్తారు.
➾ మొత్తం తెల్ల రక్తకణాల్లో ఇవి 25–28 శాతం వరకు ఉంటాయి.
➾ డబ్ల్యూబీసీల‍్లో అతి చిన్న రక్తకణాలు లింపోసైట్లు. ఇవి గుండ్రంగా ఉంటాయి. కేంద్రకం చాలా పెద్దగా ఉంటుంది.
➾ వీటి జీవిత కాలం రెండు గంటల నుంచి కొన్ని రోజులు.
➾ లింపోసైట్స్ రెండు రకాలు..
1) బి–లింపోసైట్స్ 2) టిృ లింపోసైట్స్
బిృ లింపోసైట్స్
➾ ఇవి దీర్ఘ అస్థిమజ్జ నుంచి ఏర్పడతాయి.
➾ వీటి జీవిత కాలం 12 నుంచి 24 గంటలు. కొన్ని మాత్రం నెల వరకూ జీవిస్తాయి.
➾ అసంక్రామ్యతను కలిగిస్తాయి.
➾ వీటిని CD8 కణాలు అంటారు.
టీ-లింపోసైట్స్ (CD4 / T4)
➾ ఇవి థైమస్ గ్రంథి నుంచి ఏర్పడతాయి.
➾ రక్తంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని ఇవి గుర్తిస్తాయి. అనంతరం వ్యాధి కారకాన్ని భక్షక కణానికి అందిస్తాయి.
➾ వ్యాధి కారకాన్ని గుర్తించిన కొన్ని టి ృ లిం΄ోసైట్స్, బిృలిం΄ోసైట్స్‌ని ప్రేరేపిస్తాయి.
➾ హెచ్‌ఐవీ వైరస్ లేదా రిట్రో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట ఖీ4 లిం΄ోసైట్స్‌పై దాడిచేసి నాశనం చేస్తుంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఎయిడ్స్ వ్యాధి వస్తుంది.
➾ ఎయిడ్స్ వ్యాధిని 1981లో యూఎస్‌ఏలో మొదటి సారి గుర్తించారు. భారతదేశంలో 1986లో చెన్నైలో గుర్తించారు.
మోనోసైట్స్
ఇవి తెల్ల రక్తకణాలన్నింటిలో కెల్లా అతిపెద్దవి. ఈ కణాల కేంద్రకం మూత్రపిండాకారం (కిడ్నీ)లా ఉంటుంది. ఇవి అంటు రోగం (వ్యాధి గ్రస్తభాగం) వద్దకు వెళ్లి బ్యాక్టీరియాలను చంపుతాయి. ఈ మోనోసైట్స్ సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. మోనోసైట్స్‌నే రక్తం నిజమైన పారిశుద్ధ్య కార్మికులు అంటారు. వీటి జీవిత కాలం 2 నుంచి 5 రోజులు.
రక్త ఫలకికలు
ఈ కణాలు అస్థిమజ్జలోని మెగా క్యారియోసైట్స్ అనే కణాల నుంచి ఏర్పడతాయి. ఇవి పూర్తిస్థాయి రక్తకణాలు కావు. ఇవి ద్వికుంభాకారంలో బల్లపరుపుగా ఉంటాయి.
➾ ఈ కణాల్లో కేంద్రకం ఉండదు.
➾ వీటి సంఖ్య 2 నుంచి 4 లక్షలు / క్యూబిక్ మి.లీ. రక్తం.
➾ వీటి జీవిత కాలం 3 నుంచి 10 రోజులు.
➾ క్షీరదాల్లో మాత్రమే రక్త ఫలకికలుంటాయి.
➾ డెంగ్యూ, ఎబోలా వ్యాధుల్లో వైరస్ ప్రభావం వల్ల రక్త ఫలకికల సంఖ్య విపరీతంగా తగ్గి రోగి మరణిస్తాడు.
రక్తఫలకికల విధి: రక్తాన్ని గడ్డకట్టించడం (రక్త స్కందనకు తోడ్పడుతాయి. కాబట్టి వీటిని థ్రాంబోసైట్స్ అంటారు (థ్రాంబస్ అంటే రక్తం గడ్డకట్టడం అని అర్థం).
➾ గాయమైనప్పుడు ఆ ప్రాంతంలోని రక్త ఫలకికలు విచ్ఛిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్ (థ్రాంబోకైనేజ్) అనే రసాయనాన్ని స్రవిస్తాయి.
➾ రక్త స్కందనకు నాలుగు కారకాలు అవసరం. అవి..
1. రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే ఎంజైమ్..థ్రాంబోప్లాస్టిన్ / థ్రాంబోకైనేజ్.
2. హార్మోన్.. ప్రాథ్రాంబిన్ లేదా ఫైబ్రినోజన్.
3. విటమిన్..ఓ.
4. మూలకం.. ఇ్చ+2 (కాల్షియం అయాన్లు).
➾ రక్త స్కందనకు 13 కారకాలు అవసరమని ఇటీవల గుర్తించారు.
➾ రక్తం గడ్డ కట్టే యాంత్రికాన్ని వివరించింది బెస్ట్, టేటర్.
➾ రక్తం గడ్డ కట్టే యాంత్రికంలో మూడు దశలు ఉంటాయి.
ఐ) థ్రాంబో΄్లాస్టిన్ విడుదల
➾ దెబ్బతిన్న రక్త ఫలకికల నుంచి థ్రాంబోప్లాస్టిన్ విడుదలవుతుంది.
ఐఐ) ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్‌గా మారడం
ఐఐఐ) ఫైబ్రినోజన్ ఫైబ్రిన్‌గా మారడం
➾ ౖఫైబ్రిన్ రక్తంలో కరిగి ఉన్న ఫైబ్రినోజన్‌ను ఫైబ్రిన్ ΄ోగులుగా మారుస్తుంది. తర్వాత ఈ ఫైబ్రిన్ ΄ోగులు సంక్లిష్టమైన వలను ఏర్పర్చి గాయం లోపలి తలాన్ని అంటిపెట్టుకొని బిరడా వలె మూసి రక్తాన్ని బయటకు రానీయదు.
రక్త స్కందన నివారణ పదార్థాలు
➾ రక్తం రక్తనాళాల్లో O2ను రవాణా చేస్తున్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా హిపారిన్ తోడ్పడుతుంది. దీన్ని కాలేయం స్రవిస్తుంది.
➾ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి సోడియం, పొటాషియం, అల్యూమినియం సిట్రేట్స్, ఆక్సలేట్స్‌ను కలుపుతారు.
సరస్సు | దేశం | ప్రత్యేకత |
హ్యురాన్ | యూఎస్‌ఏ, కెనడా | మనిటౌలిన్ ద్వీపం ఉన్న సరస్సు |
తాంగాన్యికా | టాంజానియా, జాంబియా, బురుండి | ప్రపంచంలో అతి ΄÷డవైంది, రెండో లోతైన సరస్సు |
బైకాల్ | రష్యాలోని సైబీరియా | ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు |
గ్రేట్‌బేర్ | కెనడా | ఒకే దేశంలో విస్తరించి ఉంది. |
మలావి | మలావి, మొజాంబిక్, టాంజానియా |
గతంలో వచ్చిన ప్రశ్నలు
1. శిశువు పితృత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష? (సివిల్స్, 2010)
1) అమ్నియో సెంటాసిస్
2) డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
3) జన్యు సైక్లింగ్
4) ఏదీకాదు
2. అర్టికేరియా అనేది ఒక రకమైన? (గ్రూప్–4, 1989)
1) వ్యాధి కలుగజేసే మొక్క
2) ఎలర్జీ మొక్క
3) రసాయనం
4) ఏదీకాదు
3. మానవ శరీరంలోని ఏ అవయవంలో లింపోసైట్స్ ఉత్పత్తి అవుతాయి? (సివిల్స్, 2004)
1) కాలేయం 2) ప్లీహం
3) దీర్ఘ అస్థి 4) క్లోమం
4. వ్యాధి నిరోధకతను పెంచే రక్త కణాలు? (ఆర్‌డీవోస్ 1992 / వాటర్ వర్క్స్. మెయిన్, 2008)
1) ల్యూకోసైట్స్ 2) మోనోసైట్స్
3) లింపోసైట్స్ 4) న్యూట్రోఫిల్స్
5. కొన్ని రకాల పుష్పించే మొక్కలు ఎలర్జీని ఉత్పత్తి చేసే పు΄÷్పడి రేణువులను కలిగి ఉంటాయి. అలాంటి వాటికి ఉదాహరణ?
1) పార్దీనియం హిస్టిరోఫోరస్
2) స్థూలకాయ కోడి
3) స్పైని అమరాంథీస్
4) పైవన్నీ
6. రక్తంలోని ప్రతిజనకం అనేది? (సివిల్స్, 2001)
1) హానికర బ్యాక్టీరియాలను నిర్మూలిస్తుంది
2) విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది
3) శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది
4) యాంటీబాడీల ఏర్పాటులో కీలకపాత్ర
7. మానవ రక్తంలో అధికంగా ఉండే డబ్ల్యూబీసీలు?
(అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ ట్రైబల్, 2002)
1) ఇసినోఫిల్స్ 2) బేసోఫిల్స్
3) న్యూట్రోఫిల్స్ 4) మోనోసైట్స్
8. తెల్ల రక్తకణాల జీవిత కాలం? (ఏపీపీఎస్సీ టౌన్ ప్లానింగ్, 2012)
1) 12–13 రోజులు 2) 16–18 రోజులు
3) 11–12 రోజులు 4) 10–12 రోజులు
9. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకపోవడానికి కారణం? (గ్రూప్–1, 1994)
1) ఫైబ్రిన్ లేకపోవడం
2) ఫైబ్రినోజన్ ఉండటం
3) Ca+2 ఉండటం
4) థ్రాంబో ప్లాస్టిన్ లేకపోవటం
10. మానవుడిలో రక్తం గడ్డ కట్టేందుకు ఎంత సమయం పడుతుంది?
(గెజిటెడ్, 2006)
1) 10 నిమిషాలు 2) 8 నిమిషాలు
3) 7 నిమిషాలు 4) 3–5 నిమిషాలు
సమాధానాలు
1) 2; 2) 2; 3) 3; 4) 3;
5) 4; 6) 4; 7) 3; 8) 1;
9) 1; 10) 4.
Tags
- biology material for groups exams
- appsc and tspsc exams
- material and model questions for groups exams
- previous and preparatory questions for groups exams
- preparatory questions for biology exams
- group exams biology
- bit banks for biology exams
- Competitive Exams
- appsc and tspsc biology
- Government Jobs
- police jobs exams
- biology based questions for groups exams
- Education News
- Sakshi Education News