TSPSC Groups Study Material : ఈ స్టడీ మెటీరియల్స్ శుద్ద దండగ.. ఈ పుస్తకాలు అయితే బెస్ట్..!
ఇలాంటి మెటీరియల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. మూస విధానంలో, షార్ట్ కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని మెటీరియల్స్ అడ్డగోలుగా, తప్పులతడకగా ఉంటున్నాయని.. అకడమిక్ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, మెటీరియల్స్‌లో ఇచ్చే దానికి పోలిక ఉండటం లేదని, దీనిపై వివరణ అడిగినా కోచింగ్ సెంటర్స్ సరిగా స్పందించట్లేదని అభ్యర్థులు అంటున్నారు.
ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్ కోసమే..
గ్రూప్స్‌కు ఉన్న డిమాండ్, అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు. చరిత్ర మెటీరియల్స్‌లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారని, అభ్యర్థులు గుర్తించి చెబితే అచ్చు తప్పులని దాటేస్తున్నారని అంటున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్ కొనాలో నిర్వాహకులు సూచిస్తున్నారని, ఇదంతా వ్యాపారంగా సాగుతోందని నిపుణులు అంటున్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులతో ముందే మాట్లాడుకుని, వారికి నెలకు కొంత ముట్టజెప్పి మెటీరియల్ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్స్ ప్రకటన విడుదలైన మర్నాటి నుంచి ఈ ప్రక్రియ మొదలైందని, ఎక్కడా నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్ కోసమే రూ. 7 వేల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
తెలుగు అకాడమీ దగ్గర అయితే..
తెలుగు అకాడమీ స్టడీ మెటీరియల్‌లో నాణ్యత ఉందని, చాప్టర్లలో లోతైన విధానం కనిపిస్తోందని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్స్ సిలబస్ ప్రకారం మెటీరియల్ సిద్ధం చేయించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే తగినవిధంగా పుస్తకాలు అందుబాటులో లేవు. మెటీరియల్ ముద్రణ, పంపిణీలో జరిగిన జాప్యమే దీనికి కారణమని అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మెటీరియల్ విడుదలవగా విక్రయ కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు.
TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండానే..
ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు లాభాలే కొలమానంగా పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్‌లో నాణ్యత కనిపించట్లేదు. ఇది వ్యాపారమైనప్పుడు నాణ్యత ఉంటుందని ఆశించడం కూడా సరికాదు. తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ముద్రిస్తుంది. కాబట్టి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పని ఓపెన్ వర్సిటీ కూడా చేయాలి. అక్కడ అవసరమైన వనరులున్నాయి.
– ప్రొఫెసర్ హరగోపాల్ (సామాజిక వేత్త)
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
ఈ పుస్తకాలు అయితే బెస్ట్..
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివిన అభ్యర్థి గ్రూప్స్‌లో ఎలా ప్రశ్న వచి్చనా సమాధానం రాయగలడు. ప్రైవేటు స్టడీ మెటీరియల్ ఫాలో అయితే ప్రధాన పరీక్షలో తికమకపడటం ఖాయం. నాణ్యత కన్పించని ప్రైవేటు మెటీరియల్‌కు దూరంగా ఉండటమే మంచిది.
– దండెబోయిన రవీందర్ (ఉస్మానియా వర్సిటీ వీసీ)
గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గాలంటే..ఇవి తప్పక చదవాల్సిందే..
సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు..
కోచింగ్ కేంద్రం వాళ్లు తాము చెప్పిన చోట మెటీరియల్ కొనాలని చెప్పారు. అకాడమీ మెటీరియల్‌కు, ప్రైవేటు స్టడీ మెటీరియల్‌కు అస్సలు పోలిక ఉండట్లేదు. లోతైన అవగాహన కనిపించట్లేదు. కొన్న తర్వాత గానీ ఈ విషయం తెలియట్లేదు. హిస్టరీలోనైతే సంఘటన తేదీలు కూడా తప్పుగా ముద్రించారు. చరిత్రలో వరుస సంఘటనల్లో కొన్ని తప్పించారు. దీంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు.
– సబ్బతి రమ్య (గ్రూప్స్ అభ్యర్థిని)
Groups Books: గ్రూప్స్ పుస్తకాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..: ఎ.వెంకట రమణ, గ్రూప్–1 విజేత
తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?
శాఖల వారీగా గ్రూప్-1 పోస్టుల వివరాలు.. వయోపరిమితి ఇలా .. :
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |
582 గ్రూప్-2 ఉద్యోగాలు.. ఉండే పోస్టులు ఇవే..
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్ (నాయిబ్ తహసీల్దార్), సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (కో–ఆపరేటివ్ సబ్ సర్వీసెస్), అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పీఆర్), అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండోమెంట్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్, లా).
Groups Guidance: మొదటిసారిగా గ్రూప్ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోసమే..
గ్రూప్-2 మొత్తం మార్కులు: 600
రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) :
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
150 | 2 1/2 | 150 |