Skip to main content

Groups Books: గ్రూప్స్‌ పుస్తకాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..: ఎ.వెంకట రమణ, గ్రూప్‌–1 విజేత

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు గ్రూప్స్‌ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
ఎ.వెంకట రమణ, గ్రూప్‌–1 విజేత (డిప్యూటీ కలెక్టర్‌)
ఎ.వెంకట రమణ, గ్రూప్‌–1 విజేత (డిప్యూటీ కలెక్టర్‌)

ఈ పరీక్షలకు.. ఎంతో క్రేజ్‌. వీటికి లక్షల మంది ప్రిపేర్‌ అవుతుంటారు. ఇలాంటి పరీక్షల్లో గమ్యం వైపు ప్రయాణం సాగించే వారే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు.  ఈ నేపథ్యంలో.. గ్రూప్స్‌ పరీక్షలలో గతంలో విజయం సాధించిన ర్యాంకర్ల అనుభవాలు మీ విజయానికి ఒక మార్గ నిర్ధేశం అయ్యే అవకాశం ఉంది. గ్రూప్‌–1లో విజేతగా నిలిచిన ఎ.వెంకట రమణ (డిప్యూటీ కలెక్టర్‌)గారి సలహాలు, సూచనలు మీకోసం..

ఎలాంటి ఆందోళన లేకుండా, ఒత్తిడికి గురికాకుండా..

Success Tips


గ్రూప్స్‌ పరీక్షల విషయంలో అత్యంత ప్రధానమైన అంశం.. సమయ పాలన పాటించడం. ప్రిపరేషన్‌ సమయంలో ఆయా అంశాలపై పట్టు సాధించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. మరోవైపు ప్రిపరేషన్‌ నుంచే నిర్దిష్ట సమయ పాలన అలవర్చుకుంటే పరీక్షలోనూ ఎలాంటి ఆందోళన లేకుండా, ఒత్తిడికి గురికాకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రిపరేషన్‌ను మొదలు పెట్టే ముందు..
ప్రిపరేషన్‌ మొదలు పెట్టే ముందు అభ్యర్థులు ప్రధానంగా సిలబస్‌లోని అంశాలను, పరీక్ష విధానాన్ని అవగాహన చేసుకోవాలి. సిలబస్‌లో తమకు పట్టున్న అంశాలు, గుర్తున్న అంశాలను, క్లిష్టంగా భావించే అంశాలను విభజించుకొని.. వాటి ప్రాధాన్యం మేరకు ప్రిపరేషన్‌లో టైం కేటాయించాలి. అదే విధంగా ప్రిపరేషన్‌ సమయంలో ముఖ్యమైన అంశాలతో సూటిగా, స్పష్టంగా, సరళంగా సమాధానం రాసేలా ప్రాక్టీస్‌ చేయాలి. దీన్ని ప్రిలిమ్స్, స్క్రీనింగ్‌ టెస్ట్‌ల ప్రిపరేషన్‌ నుంచే అనుసరించాలి. దీనివల్ల తర్వాత దశలో ఉండే మెయిన్స్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

TSPSC Groups Preparation Plan: ఎలాంటి ఒత్తిడి.. టెన్ష‌న్ లేకుండా.. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వండిలా..

పుస్తకాల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Books


ప్రిపరేషన్‌ సమయంలో ఒక సబ్జెక్ట్‌లో ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్లను రాసుకోవాలి. మలి దశలో సదరు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌కు ఉప క్రమించినప్పుడు అంతకుముందు పాయింట్ల రూపంలో రాసుకున్న వాటిలో ఎన్ని గుర్తున్నాయో అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. పుస్తకాల ఎంపిక కూడా ఆయా సబ్జెక్ట్‌లలో పట్టు సాధించే విషయంలో ఎంతో కీలకంగా నిలుస్తుంది. ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. దీనికి భిన్నంగా ఒకే సబ్జెక్ట్‌కు అయిదారు పుస్తకాలు చదివితే మరింత నాలెడ్జ్‌ వస్తుందనుకోవడం పొరపాటే అవుతుంది. 

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
      మెటీరియల్‌ ఎంపిక విషయంలో హిస్టరీకి బిపిన్‌ చంద్ర పుస్తకాలు, పాలిటీకి లక్ష్మీకాంత్‌ పుస్తకం, ఎకానమీ విషయంలో మిశ్రా అండ్‌ పూరి మెటీరియల్‌ ఉపయుక్తంగా ఉంటాయి. అదే విధంగా డిగ్రీ స్థాయిలోని హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ పుస్తకాలు తప్పక అధ్యయనం చేయాలి. రాష్ట్రాల సంబంధిత అంశాల విషయంలో అకాడమీ పుస్తకాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అదే విధంగా సోషియో ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌ గణాంకాలు చదవడం లాభిస్తుంది. అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో తాము చదివిన అంశాలు దీర్ఘకాలం గుర్తుండేలా మెమొరీ టిప్స్‌ పాటించాలి. తమకు అనుకూలమైన టిప్స్‌ను అనుసరించాలి. ఉదాహరణకు పాయింటర్స్‌ అప్రోచ్, షార్ట్‌ నోట్స్, టాపిక్‌ వైజ్‌గా ఇంపార్టెంట్‌ పాయింట్స్‌ రాసుకోవడం, విజువలైజేషన్, మైండ్‌ మ్యాపింగ్‌ వంటి టెక్నిక్స్‌ ఉపయోగపడతాయి.

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

Published date : 05 Apr 2022 01:47PM

Photo Stories