Skip to main content

TSPSC Group-3 Notification : 1,373 గ్రూప్‌-3 పోస్టుల‌కు డిసెంబర్‌లోనే నోటిఫికేష‌న్‌..? ఈ పోస్టుల‌కు ప‌రీక్ష ఎలా ఉంటుందంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ రాష్ట్రంలో ఒక ప‌క్క‌.. ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక సంస్థలు మాత్రం నోటిఫికేషన్లు విడుద‌ల చేస్తున్నాయి.

ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖతోపాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇందులో కొన్నింటికి పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) 1373 గ్రూప్‌-3 పోస్టుల భ‌ర్తీ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నది. ఈ గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు వ‌చ్చే నెల డిసెంబ‌ర్‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు స‌న్న‌హాలు చేస్తుంది. అలాగే గ్రూప్‌-3లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమున్నది.

TSPSC Group-2 Notification : 726 గ్రూప్‌-2 పోస్టుల‌కు డిసెంబర్‌లో నోటిఫికేష‌న్‌..? ప‌రీక్షావిధానం ఇదే..

వ‌చ్చే డిసెంబర్ నెల‌లోనే మూడు కీలక నోటిఫికేష‌న్ల‌కు..

tspsc jobs notifications 2022

టీఎస్‌పీఎస్సీ డిసెంబర్‌లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనున్నది. గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లు మూడు వచ్చేనెల డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్ప‌టికే గ్రూప్‌-2, 3, 4కి సంబంధించి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసింది. గ్రూప్‌-2లో భాగంగా 726 ఉద్యోగాలు ఉండ‌గా.., గ్రూప్‌-3లో 1,373 ఉద్యోగాలు, గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయనున్నది. అయితే.. గ్రూప్‌-2, 3, 4లో కొత్తగా కొన్ని పోస్టులను చేరుస్తూ.. న‌వంబ‌ర్‌ 24వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష‌యం తెల్సిందే. గ్రూప్‌-2లో మరో 6 రకాల పోస్టులు, గ్రూప్‌ -3లో మరో 2, గ్రూప్‌ -4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. 

గ్రూప్‌-3 పోస్టులు ఇవే..
గ్రూప్‌-3లో సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), సీనియర్‌ ఆడిటర్, అసిస్టెంట్‌ ఆడిటర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌, గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఉన్నాయి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 ప‌రీక్షావిధానం..

tspsc group 3 exam

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మార్కులు: 450

పేపర్‌ సబ్జెక్ట్‌  ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150 2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ                        
  1. సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
  2. ఓవర్‌వ్యూ ఆఫ్‌ ది ఇండియన్‌ కానిస్టిట్యూషన్‌  అండ్‌ పాలిటిక్స్‌
  3. సోషల్‌ స్ట్రక్చర్‌. ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. ఇండియన్‌  ఎకానమీ ఇష్యూస్‌ అండ్‌ ఛాలెంజెస్‌
  2. ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150

పేపర్-1 (మార్కులు 150) :

జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ :
➤ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు
➤ పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
➤ ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం
➤ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
➤ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు
➤ సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు
➤ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
➤ బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి)

Telangana Government Jobs: జోన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. వయోపరిమితి భారీగా పెంపు..

పేపర్-2 (మార్కులు 150) :
చరిత్ర, పాలిటీ, సమాజం : 

History


☛ తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు
☛ శాతవాహనులు; ఇక్ష్వాకులు; విష్ణుకుండినులు; ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, వారి సాంస్కృతిక సేవ; సాంఘిక వ్యవస్థ; మత పరిస్థితులు; పురాతన తెలంగాణలో బుద్ధిజం, జైనిజం; భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం,కాకతీయ రాజ్య స్థాపన, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి వారి సేవ; కాకతీయుల పాలనా కాలంలో తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, సృజనాత్మక కళలు; రాచకొండ, దేవరకొండ వెలమలు - సాంఘిక, మత పరిస్థితులు; తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కాకతీయులకు వ్యతిరేకంగా నిరసనోద్యమాలు: సమ్మక్క-సారక్క నిరసన; కుతుబ్‌షాహీల సామాజిక, సాంస్కృతిక సేవ, భాష, సాహిత్యం, వాస్తుశాస్త్రం, పండగలు, నాట్యం, సంగీతం, కళల అభివృద్ధి; మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
☛ అసఫ్‌జాహీ రాజవంశం; నిజాం-బ్రిటిష్ సంబంధాలు: సాలార్‌జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం; నిజాంల పాలనాకాలంలో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు: విద్యా సంస్కరణలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన, ఉన్నత విద్య; ఉపాధి వృద్ధి, మధ్య తరగతి వృద్ధి.
☛ తెలంగాణ - సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పునర్జీవనం; ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభల పాత్ర; ఆంధ్రసారస్వత పరిషత్, అక్షరాస్యత, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది-హిందూ ఉద్యమం, ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమ ప్రగతి; గిరిజనోద్యమాలు, రామ్‌జీ గోండ్, కొమురం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం; కారణాలు, పరిణామాలు.
☛ ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం; ముల్కీ ఉద్యమం (1952 -56); ప్రత్యేక రక్షణల ఉల్లంఘన, ప్రాంతీయ అసమానత, తెలంగాణ ఉనికి ప్రకటన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన (1969-70)-వివక్షకు వ్యతిరేకంగా బలపడిన నిరసన, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాలు (1971- 2014).

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

భారత రాజ్యాంగం, రాజకీయాలు - పరిశీలన : 

indian constitution


✦ భారత రాజ్యాంగం - పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక
✦ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు
భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనాపరమైన అధికారాల విభజన.
✦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి - అధికారాలు, విధులు.
✦ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు - గ్రామీణ, పట్టణ పరిపాలన
✦ ఎన్నికల విధానం: స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
✦ భారత దేశంలో న్యాయ వ్యవస్థ - న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
✦ ఎ) షెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు
బి) సంక్షేమం అమలు విధానం - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్,    ✦షెడ్యూల్డ్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్.

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి

భారత రాజ్యాంగం: నూతన సవాళ్లు : 
➤ సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు
భారత దేశ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు: కులం, కుటుంబం, పెళ్లి, బంధుత్వం, మతం, తెగ, మహిళ, మధ్య తరగతి; తెలంగాణ సమాజం సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
➤ సామాజిక సమస్యలు: అసమానత్వం, బహిష్కరణ: కులతత్వం, కమ్యూనలిజం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధాప్యం.
➤ సామాజిక ఉద్యమాలు: రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
➤ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికా సమస్యలు (గర్ల్ చైల్డ్), ఫ్లోరోసిస్, వలసలు, రైతులు, నేత కార్మికుల బాధలు.
➤ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు: ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళా, పిల్లల సంక్షేమం, గిరిజన సంక్షేమం.

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

పేపర్-3 (మార్కులు 150) :

ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :

 భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు : 

indian financial growth


▶ ప్రగతి, అభివృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
▶ ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
▶ పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం- నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
▶ భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్.

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1954-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం ▶ నీళ్లు (బచావత్ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ).
▶ తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన - జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలియేషన్.
▶ వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
▶ పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం - చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి.

Telangana: భారీగా ప్ర‌భుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్క‌డి నుంచి చదవాల్సిందే..

అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు : 
☛ అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు - కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
☛ అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
☛ ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు-సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
☛ సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.

Published date : 29 Nov 2022 08:13PM

Photo Stories