TS Government Jobs: ఇక ఆలస్యం వద్దు.. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు బరిలో దిగండిలా..!
నిరుద్యోగులు కొలువు కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఏ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ కావాలి? ఉమ్మడి ప్రిపరేషన్ సాధ్యపడుతుందా? కోచింగ్ అవసరం ఎంత? ఇలా ఎన్నో ప్రశ్నలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. అభ్యర్థుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు సీనియర్ జీకే అధ్యాపకుడు సురుకొంటి మహిపాల్‌రెడ్డి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేరకే ఉద్యోగాల భర్తీ
ప్రకటించిన పోస్టులు మూడు విభాగాలు.. అవి.. :
ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే 27 శాఖల్లోని ఖాళీలను మూడు రకాలుగా విభజించుకోవచ్చు. విద్యా, రక్షణ, పరిపాలన సంబంధ ఉద్యోగాలున్నాయి. ప్రతీ అభ్యర్థి ఖాళీల సంఖ్యను బట్టి కాకుండా తన అర్హత, అభిరుచితో బరిలోకి దిగాలి. ఉదాహరణకు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష రాయలనుకున్నప్పుడు శారీరక కొలతలను ముందే పరీక్షించుకుని, దీర్ఘకాలికంగా సిద్ధంగా ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ దశల్లో పరీక్షలు ఉంటాయి. డిగ్రీ అర్హత కలిగిన వారు పోటీ పడొచ్చు. 90 శాతం సిలబస్ సమానమే.
Government Jobs: గుడ్‌న్యూస్.. 30,453 ఉద్యోగాలకు అనుమతి.. ముందుగా ఈ శాఖల్లోనే పోస్టులు భర్తీ..
ఉమ్మడి ప్రిపరేషన్ ప్రమాదమే..కానీ
విద్యాపరమైన ఉద్యోగాలకు పోటీ పడేవారు టెట్‌లో అర్హత సాధించి ఎలాంటి గ్యాప్ లేకుండా డీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించాలి. గ్రూప్స్‌లో జనరల్ స్టడీస్, గురుకుల టీచర్స్ పేపర్–1 సిలబస్ 70 శాతం కామన్‌గా ఉంటుంది. ఈ రెండూ ఉమ్మడిగా ప్రిపేర్ కావచ్చని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇలాంటి నిర్ణయం చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది. గ్రూప్స్‌లో పాలిటిక్స్, ఎకనామీ, తెలంగాణ చరిత్ర కీలకం. గురుకుల టీచర్స్‌లో వారి మాతృ సబ్జెక్ట్ ముఖ్యం.
గ్రూప్స్‌లోనూ..
గ్రూప్–1 నోటిఫికేషన్‌కు ముందు చాలా మంది అభ్యర్థులు గ్రూప్–1కి చదివితే చాలు మిగితావి అన్ని సులభమే అన్న ఆలోచన ధోరణి విడాలి. గ్రూప్స్–1 ప్రిలిమినరీ సిలబస్ మాత్రమే మిగితా వాటిలో ఉపయోగపడుతుంది. మెయిన్స్ మొత్తం వ్యాసరూప ప్రశ్నలుండడంతో దీర్ఘకాలిక ప్రిపరేషన్, రైటింగ్ ప్రాక్టీస్ కీలకం. గ్రూప్–1 కాకుండా మిగితా వాటికి ఉమ్మడి ప్రిపరేషన్ చేయవచ్చు.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
కామన్ సిలబస్‌ను ఇలా గుర్తించాలి..
ప్రిపరేషన్‌లో 90శాతం జనరల్ స్టడీస్. ఇందులో సింహభాగం జాగ్రఫీ, డిజస్టార్ మేనేజ్‌మెంట్, కరెంట్ ఆఫైర్స్, అంతర్జాతీయ వ్యవహారాలు, శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వ పాలసీలు, పథకాలు మరోభాగంగా గుర్తించాలి. వీటికి సుమారు 60 మార్కులుంటాయి. జనరల్ సైన్స్, పాలిటి, భారత దేశచరిత్ర, రీజనింగ్, ఒక్కోవిభాగం నుంచి 15–20మార్కులు పొందొచ్చు. ఎకానమీ విషయానికి వస్తే పంచవర్ష ప్రణాళికలు వంటి సాంప్రదాయ టాపిక్స్ కాకుండా నూతన ఆర్థిక సంస్థలు, నియామకాలు, ఆర్థికసర్వే(21–22), బడ్జెట్ (22–23), కరెంట్ అంశాలపై సంసిద్ధం కావాలి.
కోచింగ్ ఎంతవరకు అవసరం అంటే...?
అభ్యర్థి సామర్థ్యం, అభిరుచి, నోటిఫికేషన్‌కు పరీక్షకు మధ్య ఉన్న సమయం ఆధారంగా కోచింగ్‌కు వెళ్లాలా.. వద్దా అని నిర్ణయించుకోవాలి. ప్రతీ సబ్జెక్టు సిలబస్‌పైన అవగాహన కలిగిన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. ప్రధాన సబ్జెక్టులకు తెలుగు అకాడమీతో పాటు ప్రమాణికమైన పబ్లికేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. కరెంట్ ఆఫైర్స్ కోసం ఒక సంవత్సరం అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం పథకాలు 2014 నుంచి చదవాలి. అభ్యర్థి లోతుగా పట్టుసాధించాలంటే కోచింగ్ వెళ్తే మంచిదే. టీశాట్ సంస్థలు మొబైల్ యాప్‌లద్వారా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. రివిజన్ పూర్తయితేనే మాక్ టెస్టులు రాయాలి. స్పష్టమైన ప్రణాళికతో చదివి విజయతీరాలకు చేరండి.
➤ గ్రూప్-1 పోస్టులు: 503
➤ గ్రూప్-2 పోస్టులు : 582
➤ గ్రూప్-3 పోస్టులు: 1,373
➤ గ్రూప్-4 పోస్టులు : 9,168
వయోపరిమితి ఇలా..
☛ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☛ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☛ ఎక్స్ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☛ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు : 17,003
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips
తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు..
80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖ అధికారులు, ఆర్థిక శాఖ అధికాలుతో చర్చించి మిగతా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.