Skip to main content

TSPSC Groups Success Tips : కంగారొద్దు... ప్రశాంతంగా గ్రూప్స్‌లో గెల‌వండిలా..

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. వరుసగా విడుదలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లతో అభ్యర్థులు పండుగ చేసుకుంటున్నారు.
Vishnu vardhan reddy, TSPSC Group 1 Ranker
విష్ణువర్ధన్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

ఈ తరుణంలో ఉద్యోగాలకి ఎలా ప్రిపేర్‌ కావాలి, ఎలాంటి మెటీరియల్‌ చదువుకోవాలి అన్న అంశాలను ఇప్పటికే సాక్షి అందిస్తూ వస్తోంది.  2017 గ్రూప్‌–1 రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంక్‌ సాధించి, ప్రస్తుతం నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగర్‌ కర్నూల్‌ వాసి విష్ణువర్ధన్‌ రెడ్డి ఎలా సన్నద్ధమయ్యారో ఆయన మాటల్లో తెలుసుకుందాం..

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

టైం టేబుల్‌ ఇంపార్టెంట్‌
కోచింగ్‌కు వెళ్లినా, వెళ్లకపోయినా టైం టేబుల్‌ రూపొందించుకుని, ప్రణాళికాబద్ధంగా ప్రిపేరవ్వాలి. గ్రూప్‌ డిస్కషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం చదువుకున్నది నలుగురితో చర్చిస్తే బాగా గుర్తుంటుంది. గ్రూప్‌ డిస్కషన్‌  పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. సమయానుసారంగా చదివితే ఉద్యోగం పక్కాగా సాధించవచ్చు. లక్ష్యం సాధించాలంటే సహనంతో ప్రిపేరవుతూ, సిలబస్‌పై అవగాహన పెంచుకొని మోడల్‌ పేపర్లను ఫాలో అవుతూ ముందుకెళ్లాలి. పుస్తకంలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తూ చదివితే గమ్యం చేరుకోవచ్చు. ఉద్యోగం సాధిస్తానన్న∙నమ్మకాన్ని అస్సలు కోల్పోకూడదు. ఉద్యోగాల విషయంలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలి. 

9,168 Jobs: కొలువులకు నోటిఫికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివీ..

విస్తృతంగా విశ్లేషించుకోవాలి...
ఉద్యోగాల్లో కొన్ని టెక్నికల్, మరికొన్ని నాన్‌ టెక్నికల్‌ ఉంటాయి. ఇంజినీరింగ్‌ లాంటి ఉద్యోగాలు రావాలంటే పుస్తకానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ గ్రూప్స్‌ పరిధిలోని ఉద్యోగాలు.. దానికి సంబంధించిన సబ్జెక్ట్‌ మొత్తం సమాజానికి అనుబంధంగా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌లో చదివే ప్రతి అంశాన్నీ పుస్తకానికే పరిమితం చేయకుండా సమాజానికి అనువదిస్తూ ప్రిపేరయితే అది మన మైండ్‌లో ఫిక్స్‌ అయిపోతుంది. ఏకాగ్రతతో చదవడంతో పాటు అందులోని ప్రధాన పాయింట్లను నోట్‌ చేసుకొని, వాటిని రివైజ్‌ చేస్తే మొత్తం విషయం అవగతమవుతుంది.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

ప్రశాంత వాతావరణంలో ప్రిపేరవ్వాలి...
మొదట ఎలాంటి చికాకులు, ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రిపరేషన్‌  మొదలుపెట్టాలి. ప్రిపరేష‌న్‌ విషయంలో ప్రతిరోజూ ఏ టైంలో ఏం చేయాలనేది సొంతంగా టైం టేబుల్‌ తయారు చేసుకోవాలి. తెలుగు మీడియం వాళ్లు తెలుగు అకాడమీకి ప్రాధాన్యం ఇవ్వాలి. దాంతోపాటు మరో బుక్‌ ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఎక్కువ బుక్స్‌ ఫాలో కాకూడదు. దీనివల్ల కన్ఫ్యూజన్‌ కు గురై లక్ష్యం నెరవేరదు. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రతి ఉద్యోగ పరీక్షను రాయాలి. ఒక ఉద్యోగం వస్తే కాన్ఫిడెంట్‌ పెరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ సబ్జెక్ట్‌ అయినా డెప్త్‌గా తెలుసుకోవాలంటే ఆ సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉన్న వాళ్లతో మాట్లాడాలి.

APPSC Group-1 Ranker Success Story : రైతు బిడ్డ.. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడిలా.. వీరి ప్రోత్సాహంతోనే..

ప్రతీ రోజూ పేపర్‌ రీడింగ్‌ తప్పనిసరి..
ఉద్యోగార్థులు ప్రతిరోజూ పేపర్‌ చదవడం అలావాటు చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకోవడంతో పాటు మోడల్‌ టెస్ట్‌ వారానికి ఒకసారి రాసేలా చూసుకోవాలి. సమయం అనేది చాలా ఇంపార్టెంట్‌. మనం ఎంత టైంలో రాయగలుగుతున్నాం అనేది తెలుసుకుని సన్నద్ధమవుతూ ఉండాలి. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను సద్వినియోగం చేసుకోవాలి. మాక్‌టెస్ట్‌లు, మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఎదుటివారు ఎక్కువ గంటలు చదువుతున్నారని మీరు అలా చేయవద్దు. మీ సామర్థ్యం, తెలివిని బట్టి ప్రిపేరయితే ఉద్యోగం సాధించవచ్చు.

APPSC Group1 Ranker Aravind Success Story : గ్రూప్‌–1 ఆఫీసర్‌ కావాలని కలలు కన్నాడు.. అనుకున్న‌ట్టే సాధించాడిలా..

Published date : 02 Dec 2022 06:38PM

Photo Stories