9,168 Jobs: కొలువులకు నోటిఫికేషన్.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివీ..
టీఎస్‌పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు:
గ్రూప్–4 పోస్టులకు డిసెంబర్ 23 నుంచి 2023 జనవరి 12వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డిసెంబర్ 23న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని 2023 ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే..
తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి.
చదవండి: Competitive Exam Best Success Tips : ఏ పోటీ పరీక్షకైన ఇలా చదివితే ఉపయోగం ఉండదు.. ఇలా చదివితేనే..
విభాగాల వారీగా ఖాళీల వివరాలివీ..
శాఖ/విభాగం |
పోస్టులు |
పురపాలన, పట్టణాభివృద్ధి |
2,701 |
రెవెన్యూ |
2,077 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి |
1,245 |
ఉన్నత విద్య |
742 |
ఎస్సీ అభివృద్ధి |
474 |
ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం |
338 |
వెనుకబడిన తరగతుల సంక్షేమం |
307 |
ఆర్థిక శాఖ |
255 |
గిరిజన సంక్షేమం |
221 |
మైనార్టీ సంక్షేమం |
191 |
హోం శాఖ |
133 |
కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు |
128 |
మాధ్యమిక విద్య |
97 |
వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాలు |
72 |
నీటిపారుదల– క్యాడ్ |
51 |
వ్యవసాయ, సహకార |
44 |
పర్యావరణ, అటవీ, సైన్స్–టెక్నాలజీ |
23 |
రవాణా, రోడ్డు, భవనాలు |
20 |
మహిళాశిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం |
18 |
యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతికం |
13 |
పరిశ్రమలు–వాణిజ్యం |
7 |
సాధారణ పరిపాలన |
5 |
ప్రణాళిక |
2 |
పశుసంవర్థక, డెయిరీ, మత్స్య అభివృద్ధి |
2 |
విద్యుత్ శాఖ |
2 |