Skip to main content

TSPSC Group 1 Prelims 2022 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 కటాఫ్ మార్కులు ఉండవ్‌.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(TSPSC) నిర్వ‌హించిన‌ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల్లో ఇంకా గందరగోళం వీడలేదు.

రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

TSPSC Group 1 Prelims 2022 Subject Wise Weightage : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో.. ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబ‌ర్ 16వ తేదీన (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 2,86,051 మంది దీనికి హాజరయ్యారు. 

అభ్యర్థుల్లో గందరగోళమే.. ఎందుకంటే..? 
అభ్యర్థులుగానీ, కోచింగ్‌ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది. కానీ ఆదివారం నాటి గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది.

TSPSC Group 1 Prelims Question Paper with Key : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం క్లిక్ చేయండి

ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడు గుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

ఈ సారి కటాఫ్‌ మార్కులేమీ ఉండవు! 

TSPSC

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రత్యేకంగా కటాఫ్‌ మార్కులంటూ ఏమీ ఉండవని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లోనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా తెలిపిన కమిషన్‌.. అక్టోబ‌ర్ 17వ తేదీన (సోమవారం) మరోమారు ప్రకటన విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని.. మల్టీజోన్ల వారీగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తారు. మొత్తం 503 పోస్టులు ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మార్కులు వచ్చిన సుమారు 25,150 మందికి మెయిన్స్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. 

TSPSC Group 1 Prelims 2022 Question Paper PDF : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

ప్రశ్నపత్రం కోడింగ్‌లో..
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం కోడింగ్‌లో టీఎస్‌పీఎస్సీ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఇదివరకు కమిషన్‌ నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రాన్ని ఏ, బీ, సీ, డీ నాలుగు కోడ్‌లలో తయారు చేసింది. ఈసారి కాపీయింగ్‌కు ఆస్కా రం లేకుండా ఆరు డిజిట్ల కోడ్‌తో ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చింది. విభిన్న రూపాల్లో ప్రశ్నపత్రం తయారైంది. దీనితో ఏ కోడ్‌కు చెందిన ప్రశ్న పత్రానికి నమూనా కీని తయారు చేయాలనే దానిపై కోచింగ్‌ సెంటర్లు, నిపుణులు సైతం తికమక పడ్డారు.

‘కీ’ని ఎప్పుడు విడుదల చేస్తారంటే..?

key

చివరికి ప్రశ్నపత్రం కోడ్‌కు బదులుగా.. పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కొన్నింటికి జవాబులను నిర్ధారిస్తూ సామాజిక మాధ్యమాల్లో అంచనాలను పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. దీనితో టీఎస్‌పీఎస్సీ కీ వచ్చేదాకా అంచనాకు వచ్చే పరిస్థితి లేదని అభ్యర్థులు అంటున్నారు. కమిషన్‌ కీ విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడు తుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్‌ జవాబు పత్రాలను కమిషన్‌ వెబ్‌ సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన తర్వాతే ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు  వ‌చ్చాయంటే..

  స‌బ్జెక్ట్  మార్కులు
1.  ఇండియ‌న్ పాలిటీ & గవర్ననెస్ 16 
2.  ఇండియ‌న్ హిస్ట‌రీ  9
3.  తెలంగాణ హిస్ట‌రీ & క‌ల్చ‌ర్ 16
4.  జియోగ్రఫీ 16
  1. ఇండియా జియోగ్రఫీ (8 మార్కులు)  
  2. వ‌ర‌ల్డ్ జియోగ్రఫీ (3 మార్కులు)  
  3. తెలంగాణ జియోగ్రఫీ (5 మార్కులు)  
5.  ఎకాన‌మీ (ఇండియా & తెలంగాణ‌)  5
6.  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ  22
  1.బ‌యాల‌జీ (8 మార్కులు)  
  2.ఫిజిక్స్   (4 మార్కులు)  
  3.కెమిస్ట్రీ  (3 మార్కులు)  
  4.సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (7 మార్కులు)  
7.  పర్యావరణ శాస్త్రం  4
8.  డిజార్ట్స్ మేనేజ్‌మెంట్  3
9.  క‌రెంట్ అఫైర్స్ 15
10  అంత‌ర్జాతీయ సంబంధాలు  7
11  సోష‌ల్ ఎక్స్‌క్లూజ‌న్  7
12.  రిజ‌నింగ్ & డీఐ  23
13  ఇత‌రం  2
14.  తెలంగాణ రాజ‌కీయం  5
   మొత్తం 150(మార్కులు)

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

Published date : 18 Oct 2022 09:25AM

Photo Stories