TSPSC Group 1 Prelims 2022 Subject Wise Weightage : గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో.. ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయంటే..
రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. తెలంగాణలోని పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
TSPSC Group 1 Prelims Cut Off Marks : టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఇలా..?
సివిల్స్ తరహాలో..
మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరయ్యారు. ఈ సారి గ్రూప్–1 ప్రిలిమ్స్ కొశ్చన్ పేపర్ చాలా కష్టంగా వచ్చిందని సబ్జెక్ట్ నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ప్రశ్నలు సివిల్స్ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కువ ప్రశ్నలు ఇలాగే..
కరెంట్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సమాధానాలు గుర్తించేందుకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం మాత్రమే ఉంటుంది. ఐతే ప్రశ్నల కఠినంగా రావడంతో నిముషం సమయం సరిపోలేదని, ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు అధికంగా వచ్చాయని అన్నారు. నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నాయి.
☛ టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
ప్రశ్నలను పూర్తిగా చదివేందుకు కూడా సమయం సరిపోలేదని అన్నారు. అందువల్ల అన్ని ప్రశ్నలకు సమాధానం రాయలేక పోయామని, సగటున 15 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించలేకపోయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్ 2022లో ఏఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయంటే..
సబ్జెక్ట్ | మార్కులు | |
1. | ఇండియన్ పాలిటీ & గవర్ననెస్ | 16 |
2. | ఇండియన్ హిస్టరీ | 9 |
3. | తెలంగాణ హిస్టరీ & కల్చర్ | 16 |
4. | జియోగ్రఫీ | 16 |
1. ఇండియా జియోగ్రఫీ (8 మార్కులు) | ||
2. వరల్డ్ జియోగ్రఫీ (3 మార్కులు) | ||
3. తెలంగాణ జియోగ్రఫీ (5 మార్కులు) | ||
5. | ఎకానమీ (ఇండియా & తెలంగాణ) | 5 |
6. | సైన్స్ అండ్ టెక్నాలజీ | 22 |
1.బయాలజీ (8 మార్కులు) | ||
2.ఫిజిక్స్ (4 మార్కులు) | ||
3.కెమిస్ట్రీ (3 మార్కులు) | ||
4.సైన్స్ అండ్ టెక్నాలజీ (7 మార్కులు) | ||
7. | పర్యావరణ శాస్త్రం | 4 |
8. | డిజార్ట్స్ మేనేజ్‌మెంట్ | 3 |
9. | కరెంట్ అఫైర్స్ | 15 |
10 | అంతర్జాతీయ సంబంధాలు | 7 |
11 | సోషల్ ఎక్స్‌క్లూజన్ | 7 |
12. | రిజనింగ్ & డీఐ | 23 |
13 | ఇతరం | 2 |
14. | తెలంగాణ రాజకీయం | 5 |
మొత్తం | 150(మార్కులు) |