Skip to main content

TSPSC Group 1 Prelims Cut Off Marks : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ కటాఫ్ మార్కులు ఇలా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షను అక్టోబ‌ర్ 16వ తేదీ (ఆదివారం) నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

ఈ ప‌రీక్ష‌కు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజర‌య్యారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్‌ నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

TSPSC Group 1 Prelims Question Paper with Key : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం క్లిక్ చేయండి

ఒకోక్క పోస్టుకు పోటీ ఎంతంటే..?
ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్‌పీఎస్సీ మల్టీజోన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్‌ కేటగిరీలో మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో ఇలా..

tspsc

ఇప్పటివరకు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో జనరల్‌ మెరిట్‌ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్‌ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్‌ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్‌–1 కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్‌ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్‌ ప్రకారం కటాఫ్‌ మార్కులు మరోవిధంగా ఉంటాయి.

TSPSC Group 1 Prelims 2022 Question Paper PDF : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్‌–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్‌–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్‌–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్‌లో కటాఫ్‌ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

ఈ మార్కులను కేవలం..

tspsc group 1 prelims marks

పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్‌ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్‌ మార్కులను కేవలం మెయిన్‌ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.

త్వ‌ర‌లోనే ప్రాథమిక ‘కీ’తో పాటు..

key

అభ్యర్థుల ఓఎంఆర్‌ జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినందుకు టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి  కలెక్టర్లు, అధికారులను అభినందించారు.

TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

Published date : 17 Oct 2022 02:04PM

Photo Stories