Skip to main content

Rumors on Masood Ajaar: విమానం హైజాక్‌ సూత్రధారి మసూద్‌ అజార్‌ హతం.. ఎంతవరకు నిజం..?

అజార్‌ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. ఇది ఎంతవరకు నిజం..? అసలు విషయాలు వివరంగా..
Explosion at Bhawalpur mosque in Pakistan.  Masood Ajaar.. the mastermind behind Kandahar flight highjack  Video showing blast incident in Pakistan.

కాందహార్‌ విమానం హైజాక్‌ సూత్రధారి మసూద్‌ అజార్‌ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్‌ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Ukraine War: ఉక్రెయిన్‌కు 250 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయం

అనంతరం పాక్‌ ఆర్మీ దావూద్‌ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్‌ వాంటెడ్‌గా ప్రకటించింది.

Japan Earthquake: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు జారీ!

2008లో నేపాల్‌ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్‌ మేరకు జైళ్లలో ఉన్న అజార్‌ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్‌ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు.

Published date : 03 Jan 2024 09:32AM

Photo Stories