Rishi Sunak: విపక్ష నేత పదవి నుంచి తప్పుకున్న రిషి సునాక్
ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు అక్టోబర్ 30వ తేదీ పార్లమెంటులో ప్రకటించారు.
సునాక్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు.
అయితే.. అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్నట్టు వస్తున్న వార్తలను సునాక్ ఖండించారు. “రిచ్‌మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటాను” అని చెప్పారు.
Gender Equality: లింగ సమానత్వంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు ఇవే..