Skip to main content

To Success Journey of Hombale Films: హోంబలే ఫిల్మ్స్‌.... ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా... వీరికి సక్సెస్‌ అంత ఈజీగా రాలే...

సినిమా... ఓ రంగుల ప్రపంచం. ఎవరు ఎప్పుడు స్టార్‌ అవుతారో... ఎవరు జీరో అవుతారో ఎవరికి తెలియదు. ఒక్క సినిమా హిట్‌ అయితే వారి స్థాయే పెరిగిపోతుంది. అదే సినిమా ఫ్లాప్‌ అయితే వారి భవిష్యత్‌ అంధకారమే. ప్రతి శుక్రవారం సినిమా జనాల జీవితాలు మారుతూ ఉంటాయి.

సినిమా రంగంలో తలపండిన నిర్మాతలే సక్సెస్‌ కోసం అర్రులు చాస్తున్నారు. కానీ, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చిన ‘‘హోంబలే’’ ఫిల్మ్స్‌ నేడు దేశవ్యాప్తంగా హాట్‌ ఫేవరేట్‌గా నిలుస్తోంది. ఆ సంస్థ పేరు ఎలా వచ్చింది... వారి జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం పదండి...

kgf
ఇలవేల్పు పేరు నుంచే....
విజయ్‌ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్‌ గౌడ.. ఈ ముగ్గురికి సినిమాపై ఉన్న ఆసక్తే ‘హోంబలే ఫిల్మ్స్‌’కు కారణం. వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు విజయ్‌ కిరంగదూర్‌ మాండ్య నుంచి బెంగళూరుకు షిఫ్ట్‌ అయ్యాడు. అదే సమయంలో కార్తిక్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు. కానీ, ఈ కజి¯Œ ్సకు మాత్రం సినిమాపై ప్రేమ పోలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలనుకుని, దాని కోసం ఎంతో ప్రయత్నించి 2013లో హోంబలే ఫిలŒæ్మ్సను ప్రారంభించారు. దీనికి కిరంగదూర్, చలువే గౌడ అధినేతలుగా కార్తిక్‌ గౌడ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహిస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్‌ అని నామకరణం చేశారు.

చ‌ద‌వండి: డిగ్రీ కూడా లేని మేధావి... రామానుజన్‌ జీవిత విశేషాలు తెలుసా
తొలి ప్రయత్నం విఫలం...
సినిమాలు నిర్మించేందుకు కావాల్సిన డబ్బు, ఆసక్తి ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో విజయం దక్కదుగా. చిత్రాల నిర్మాణంపై అవగాహన లేకపోవడంతో తొలి ప్రయత్నంలో పరాజయం అందుకున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో 2014లో నిర్మించిన ‘నిన్నిందలే’ సినిమా నష్టాన్ని మిగిల్చింది. ఒక్క ఫ్లాప్‌తో వారు సంపాదించుకున్న డబ్బులో చాలా వరకు హారతి కర్పూరమైంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా.. వెనుకడుగు వేయకుండా రెండో చిత్రాన్ని యశ్‌తో కలిసి ‘మాస్టర్‌పీస్‌’ నిర్మించారు. ఈ సినిమా 2015లో రిలీజై ‘హోంబలే’ పేరు కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ మందికి తెలిసేలా చేసింది. ఈ చిత్రం వసూళ్లు సుమారు రూ. 35 కోట్లు. తర్వాత మూడో సినిమా మళ్లీ పునీత్‌ రాజ్‌కుమార్‌తో కలిసి 2017లో రాజకుమార చిత్రాన్ని నిర్మించారు. ఇది సుమారు రూ. 76 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి, అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల సరసన నిలించింది. 

చ‌ద‌వండి: ఎస్ఎస్‌సీ ఎగ్జామ్ కు ఈ అంశాల్లో నుంచే ప్ర‌శ్న‌లు...

kantara
కేజీయఫ్‌ చిత్రంతో రికార్డుల మోత
అప్పటి వరకు కన్నడ సినిమా ఎక్కడో విసిరేసినట్లు ఉండేది. అక్కడ వచ్చే సినిమాలపై ఇతర భాషల ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచే వారు కాదు. కానీ కేజీయఫ్‌తో హోంబలే వారు కన్నడ సినిమా చరిత్ర తిరగరాశారు. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన కేజీయఫ్‌ చాప్టర్‌ –1 రూ.80 కోట్లతో నిర్మిస్తే రూ.250 కోట్లు వసూలు చేసింది. ఈ ఒక్క చిత్రం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్, నిర్మాతల కెరీర్‌ను మార్చేసింది. 2018 డిసెంబరు వరకు కన్నడనాట పరిమితమైన వారి పేర్లు ‘కేజీయఫ్‌’తో జాతీయ స్థాయిలో మెరిశాయి. ఇక ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ దేశవ్యాప్తంగా సుమారు రూ. 1250 కోట్లు వసూలు చేయడంతో హోంబలే సంస్థపై అంచనాలు భారీగా పెరిగాయి. 

చ‌ద‌వండి: రెండు వారాలే టైం... ఎస్ఎస్‌సీ నోటిఫికేష‌న్... వివ‌రాలు
‘కాంతార’తో కొనసాగుతున్న హవా..
‘కేజీయఫ్‌ 1’ తర్వాత ‘యువరత్న’  చేసినట్లే ‘కేజీయఫ్‌ 2’ తర్వాత ‘కాంతార’ అనే సినిమాని సిద్ధం చేసింది హోంబలే ఫిల్మ్స్‌. కన్నడ వరకే పరిమితం చేద్దామనుకున్న ఈ సినిమా ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ పొందింది. దాంతో ఇతర భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేశారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో.. కర్ణాటకలోని తుళునాడు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 400 కోట్లు వసూళ్లు సాధించి.. కన్నడ ఇండస్ట్రీ గురించి దేశమంతా మరోసారి చర్చించుకునేలా చేసింది.
పరాజయంతో పాఠాలు...
‘‘ మా తొలి చిత్రం పరాజయం అందుకున్నా.. మాకెన్నో పాఠాలు నేర్పింది. మరోసారి ఫెయిల్యూర్‌ ఎదురుపడకూడదని మేం అప్పుడే నిశ్చయించుకున్నాం. ఓ ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్తున్నాం. వీధి నాటకాలు, హరికథలు సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే లా.. మన మూలాలను గుర్తుచేసేలా సినిమాలు నిర్మించాలి’’ అని అనుకుంటున్నట్లు నిర్మాతలు చెప్తారు. మొదటి ప్రయత్నంలోనే కోలుకోలేని దెబ్బతిన్నా... తిరిగి మళ్లీ బలం పుంజుకుని ప్రయత్నిస్తే విజయం దక్కుతుంది అనడానికి హోంబలే నిర్మాతల స్టోరీనే నిదర్శనం.

Published date : 22 Dec 2022 04:45PM

Photo Stories