Success Journey: ఫుట్‌బాల్‌లో తళుక్కుమన్న రాయలసీమ అమ్మాయి... ఇప్పుడు ఏకంగా అమెరికాకు...
తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాలుగో తరగతిలోనే కడపలోని వైఎస్సార్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తర్వాత శ్రీదేవి నెల్లూరు శాప్ అకాడమీలో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.
మొదటిస్థానంలో నిలిచి.....
ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఫుట్‌బాల్‌పై పట్టు ఉన్న శ్రీదేవి ఎన్నో మార్లు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్, కటక్‌లో జరిగిన జూనియర్ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్‌జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఇండియా ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినికి కోచ్‌గా కె.సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు.
చదవండి: మూత్రం తాగుతూ.... క్షణం ఒక యుగంలా...
2020లో రద్దుకావడంతో ఇప్పుడు నిర్వహిస్తున్న వైనం
ఫుట్‌బాల్ ద్వారా నిరాశ్రయులు లేని సమాజమే లక్ష్యంగా హోమ్‌లెస్ వరల్డ్ కప్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతీ ఏడాది టోర్నమెంట్స్ నిర్వహిస్తోంది. 2001లో మెల్ యంగ్, హెరాల్డ్ ష్మీడ్ దీన్ని స్థాపించారు. మొదటి వార్షిక ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2003లో ఆస్ట్రియాలోని గ్రాజ్‌లో నిర్వహించారు. 2020లో నిర్వహించాల్సిన టోర్నమెంట్ ఫిన్‌లాండ్‌లోని టాంపేర్‌లో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా అది రదై్దంది. దీంతో ఇప్పుడు యూఎస్‌ఏలోని కాలిఫోర్నియాలో టోర్నమెంట్ నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్‌లో విజయమే లక్ష్యం
ఇండియా జట్టుకు ఎంపికయ్యాను. వరల్డ్ కప్ పోటీల్లో విజయమే లక్ష్యంగా ప్రతిభ చూపుతా. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్ క్రీడపై ఎంతో మక్కువ. చదువు లేని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు.
- వజ్జల శ్రీదేవి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి