Telugu Poet: మాగ్జిమ్ గోర్కీ ‘మదర్’ నవలను తెలుగులోకి అనువదించిన వ్యక్తి?
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(ఎంవీఆర్)(78) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సెప్టెంబర్ 29న కర్నూలులోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసకర్తగా, కరపత్ర, కథా రచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికా నిర్వాహకుడిగా విభిన్న విశిష్టతలు కలిగిన వ్యక్తిగా ఆయన పేరు గడించారు.
డాక్టర్ నుంచి రాజకీయ నేతగా..
ప్రొద్దుటూరులో 1944 ఏప్రిల్ 4న జన్మించిన ఎంవీఆర్.. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివారు. ప్రొద్దుటూరులో ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారు. కొంత కాలం న్యాయవాదిగా పని చేసిన ఆయన... 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత కాలంలో రామారావుతో రాయలసీమ సమస్యలపై విభేదించి.. రాయలసీమ విమోచన సమితి స్థాపించారు.
సాహిత్య పరిచయం
- ‘కవిత’ అనే సాహిత్య మాస పత్రిక, ‘ప్రభంజనం’ అనే రాజకీయ పక్ష పత్రికను నడిపారు. 1983లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకాన్ని ప్రచురించారు.
- తెలుగు సినిమా – స్వర్ణయుగం, పురోగమనం, పరిష్కారం, ఆయుధం పట్టని యోధుడు, తెలుగింటికి వచ్చిన ద్రౌపది, చివరకు మిగిలింది, పెద్దపులి ఆత్మకథ, మాటకారి, శంఖారావం, తెలుగింటి వ్యాకరణం తదితర పుస్తకాలు రాశారు.
- మాగ్జిమ్ గోర్కీ(రష్యా రచయిత) ‘మదర్’ నవలను తెలుగులో ‘కడుపు తీపి’ పేరుతో అనువదించారు.
చదవండి: జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : డాక్టర్ ఎంవీ రమణారెడ్డి(78)
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా
ఎందుకు : గుండెపోటు కారణంగా...