Fumio Kishida: జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన నేత?
జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఫ్యుమియో కిషిడా ఎన్నికయ్యారు. దేశంలో అధికారంలో ఉన్న లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి కిషిడా మరో మంత్రి తారో కోనోపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశ తదుపరి ప్రధానిగా ఆయన అక్టోబర్ మొదటి వారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరోనా సంక్షోభం, దాని కారణంగా ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ, జనాభా తగ్గుదల, ప్రాంతీయంగా చైనా నుంచి ఏర్పడుతున్న భద్రతాపరమైన సమస్యలు వంటి సవాళ్లను కిషిడా ఎదుర్కోవాల్సి ఉంది.
ప్రస్తుత ప్రధాని యొషిహిడే సుగా ఏడాది మాత్రమే ప్రధానిగా ఉన్నారు. కరోనా కట్టడిలో వైఫల్యం, కేసులు తీవ్రతతో పాటు, ఒలంపిక్స్ నిర్వహణ వంటి వాటితో విమర్శల్ని మూటగట్టుకున్న సుగా ప్రజాదరణ కోల్పోయారు. 2021, సెప్టెంబర్ నెలాఖరుకి తాను బాధ్యతల నుంచి తప్పుకుంటానని సుగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
జపాన్ రాజధాని: టోక్యో; కరెన్సీ: జపనీస్ యెన్
జపాన్ ప్రస్తుత ఎంపరర్: నరుహితో
జపాన్ ప్రస్తుత ప్రధాని: యోషిహిడే సుగా
జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి: ఫ్యుమియో కిషిడా
చదవండి: ఇటీవల కన్నుమూసిన మహిళా హక్కుల ఉద్యమకారిణి ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జపాన్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఫ్యుమియో కిషిడా
ఎందుకు : జపాన్ ప్రస్తుత ప్రధాని యొషిహిడే సుగా రాజీనామా చేయనున్న నేపథ్యంలో...