Activist: హక్కుల ఉద్యమకారిణి కమలా భాసిన్ కన్నుమూత
ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కమలా భాసిన్(75) మృతిచెందారు. చాలా రోజులుగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మండి బహావుద్దీన్‌లో 1946, ఏప్రిల్ 24న జన్మించిన కమల.. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
రాజ్యసభకు ఎన్నికైన సర్బానంద..
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ సెప్టెంబర్ 27న అస్సాం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఎల్ మురుగన్, పుదుచ్చేరి నుంచి బీజేపీ నేత సెల్వగణపతి, తమిళనాడు నుంచి కనిమొళి ఎన్‌వీఎన్ సోము, కేఆర్‌ఎన్ రాజేశ్‌కుమార్‌లు, పశ్చిమబెంగాల్ నుంచి సుష్మితా దేవ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత రజిని పాటిల్ గెలుపొందారు.
చదవండి: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : కమలా భాసిన్(75)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కేన్సర్ కారణంగా...