ABC: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. మరోవైపు ఏబీసీ కౌన్సిల్ పబ్లిషర్ సభ్యులైన ప్రతాప్ జి. పవార్.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఏబీసీ సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్ మాసాని కొనసాగనున్నారు.
దేశంలోని వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లతో సహా ప్రధాన ప్రచురణల సర్క్యులేషన్‌లను ధృవీకరించడం, ఆడిట్ చేయడం వంటి పనులను ఏబీసీ నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
చదవండి: ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ పుస్తకాన్ని రచించిన విశ్రాంత న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–2022 ఏడాదికిగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేబబ్రత ముఖర్జీ
ఎందుకు : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్(ఏబీసీ) కార్యాకలాపాల నిర్వహణ కోసం...